Staff Nurse Jobs in Narayanpet A female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Staff Nurse Jobs in Narayanpeta : నారాయణపేట జిల్లాలో నేషనల్​ హెల్త్​ మిషన్​ (National Health Mission – NHM) విభాగంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్​సీలు)/ డిస్టిక్ట్​ హాస్పిటల్​ (డీహెచ్​)లో స్టాఫ్​ నర్స్ (Staff Nurse)​ ఉద్యోగాల భర్తీకి ప్రకటన (Notification No.02/2023) విడుదలైంది. మొత్తం 12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేశారు. విద్యార్హతల్లో మెరిట్​, రూల్​ ఆఫ్​ రిజర్వేషన్​ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

1. Staff Nurse (Maternal Health) – 09 Posts
2. Staff Nurse (NBSU) – 03 Posts

Qualification

ఉద్యోగాలకు బీ.ఎస్సీ (నర్సింగ్​) లేదా జనరల్​ నర్సింగ్​ అండ్​ మిడ్​వైఫరీ (జీఎన్​ఎం) చేసిన అభ్యర్థులు అర్హులు. అలాగే, తెలంగాణ స్టేట్​ నర్సింగ్​ కౌన్సిల్​లో రిజిస్టర్​ చేసుకొని ఉండాలి.

Salary

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,900 చెల్లిస్తారు.

Age Limit

అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు  ఉంది.

How to Apply

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా డిమాండ్​ డ్రాఫ్ట్​ తీయాల్సి ఉంటుంది. నారాయణపేట జిల్లాలో చెల్లుబాటు అయ్యేలా DM&HO.Narayanpet పేరిట డీడీ తీయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.15‌‌0, బీసీ అభ్యర్థులు రూ.250, ఓసీ అభ్యర్థులు రూ.350 చొప్పున డీడీ తీయాలి. అనంతరం వనపర్తి జిల్లా అధికారిక వెబ్​ సైట్ (https://narayanpet.telangana.gov.in/)​ ను ఓపెన్​ చేయాలి. అందులో RECRUITMENT  పై క్లిక్​ చేయాలి. ఆ తర్వాత ఫస్ట్​ నోటిఫికేషన్​ లో ఉన్న Application Form ను డౌన్​ లోడ్​ చేసుకోవాలి. దానికి విద్యార్హతలకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు, ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్​ సర్టిఫికెట్లు సెల్ఫ్​ అటెస్ట్​ చేసి జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను ఈ నెల 29వ తేదీ, సాయంత్రం 5 గంటల లోపు నారాయణపేట జిల్లా మెడికల్​ అండ్​ హెల్త్​ అధికారి ఆఫీసులో అందజేయాలి. ఆఫీసు వేళల్లో (ఉదయం 10:30 గంటల నుంచి 5 గంటల లోపు).

Selection Procedure

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను నారాయణపేట జిల్లా కలెక్టర్​ నేతృత్వంలోని జిల్లా సెలక్షన్​ కమిటీ (డీఎస్​సీ) ఎంపిక చేస్తుంది. అభ్యర్థులు బీ.ఎస్సీ (నర్సింగ్​) లేదా జీఎన్​ఎం లో సాధించిన మార్కుల్లో మెరిట్​ ఆధారంగా, అలాగే రూల్​ రిజర్వేషన్​ ప్రకారం ఎంపిక చేస్తారు.

Important Points

  • ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • కాంట్రాక్టు పద్ధతిలో ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది.
  • మెంటల్​ హెల్త్​ (Maternal Health), ఎన్​బీఎస్​యూ (NBSU) విభాగాల్లో పనిచేయాలి.
  • 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్​సీలు)/ డిస్టిక్ట్​ హాస్పిటల్​ (డీహెచ్​)లో విధులు నిర్వహించాలి.

– Staff Nurse Jobs in Narayanpeta