Staff Nurse Jobs in Narayanpeta : నారాయణపేట జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission – NHM) విభాగంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు)/ డిస్టిక్ట్ హాస్పిటల్ (డీహెచ్)లో స్టాఫ్ నర్స్ (Staff Nurse) ఉద్యోగాల భర్తీకి ప్రకటన (Notification No.02/2023) విడుదలైంది. మొత్తం 12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యార్హతల్లో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. Staff Nurse (Maternal Health) – 09 Posts
2. Staff Nurse (NBSU) – 03 Posts
ఈ ఉద్యోగాలకు బీ.ఎస్సీ (నర్సింగ్) లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) చేసిన అభ్యర్థులు అర్హులు. అలాగే, తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,900 చెల్లిస్తారు.
అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది. నారాయణపేట జిల్లాలో చెల్లుబాటు అయ్యేలా DM&HO.Narayanpet పేరిట డీడీ తీయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150, బీసీ అభ్యర్థులు రూ.250, ఓసీ అభ్యర్థులు రూ.350 చొప్పున డీడీ తీయాలి. అనంతరం వనపర్తి జిల్లా అధికారిక వెబ్ సైట్ (https://narayanpet.telangana.gov.in/) ను ఓపెన్ చేయాలి. అందులో RECRUITMENT పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ లో ఉన్న Application Form ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానికి విద్యార్హతలకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు, ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేసి జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను ఈ నెల 29వ తేదీ, సాయంత్రం 5 గంటల లోపు నారాయణపేట జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారి ఆఫీసులో అందజేయాలి. ఆఫీసు వేళల్లో (ఉదయం 10:30 గంటల నుంచి 5 గంటల లోపు).
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను నారాయణపేట జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఎంపిక చేస్తుంది. అభ్యర్థులు బీ.ఎస్సీ (నర్సింగ్) లేదా జీఎన్ఎం లో సాధించిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా, అలాగే రూల్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేస్తారు.
– Staff Nurse Jobs in Narayanpeta
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…