Staff Nurse MPHA Jobs : హైదరాబాద్ లోని బస్తీ దవాఖానలు (Basti Dawakhana), అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల (Urban Primary Health Center-UPHCs) లో స్టాఫ్ నర్స్ (Staff Nurse), మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్) (Multi Purpose Health Assistant (Female) – MPHA(F)) పోస్టుల భర్తీకి హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి (DM&HO, Hyderabad) ప్రకటన విడుదల చేశారు. మొత్తం 42 (స్టాఫ్ నర్స్ – 27, ఎంపీహెచ్ఏ – 15) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ దరఖాస్తులను పరిశీలించి విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
1.Staff Nurse – 27
2.MPHA(F) – 15
Staff Nurses : GNM or B.Sc (Nursing) or M.Sc (Nursing)
MPHA(F) : 18 months/2 years MPHW (F) Training certificate (or) 2 years Intermediate vocational MPHW (F) course with one year clinical training in selected Govt. Hospital OR apprentice ship completion certificate by the board of apprenticeship training Gol, Southern Region, Chennai.
ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు జూన్ 30, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, మాజీ సైనికులకు (Ex-Servicemen) మూడు (03) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
Staff Nurse అభ్యర్థులకు నెలకు రూ.29,900 చెల్లిస్తారు.
MPHA (F) అభ్యర్థులకు నెలకు రూ.27,300 చెల్లిస్తారు.
అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని ఆ తర్వాత అప్లికేషన్ ఫాంను హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తు కోసం స్టాఫ్ నర్స్ అభ్యర్థులు https://forms.gle/c3DMXdkyRYPWNTPm7 లింక్ ను, ఎంపీహెచ్ఏ (ఎఫ్) అభ్యర్థులు https://forms.gle/bDrRMdXzJyoqbQKe8 లింక్ ను ఓపెన్ చేయాలి. అందులో అడిగిన వివరాలన్నీ నింపాలి. డాక్యమెంట్లు అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత మీ ఈ-మెయిల్ కు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫాం వస్తుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి. దానికి ఈ కింది సర్టిఫికెట్లు జత చేయాలి.
1. ఎస్సెస్సీ మెమో
2. ఇంటర్మీడియట్ మెమో
3. కులం సర్టిఫికెట్
4. పీహెచ్/ఎక్స్ సర్వీస్ మెన్/ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ (సంబంధిత అభ్యర్థులు మాత్రమే)
5. ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్లు. ఒకవేళ ప్రైవేటులో చదివినట్లయితే రెసిడెన్స్ సర్టిఫికెట్
6. విద్యార్హతలకు (GNM/B.Sc(N)/M.Sc(N/MPHA) సంబంధించిన మార్కుల మెమోలు.
7. ప్రొవిజినల్ సర్టిఫికెట్లు
8. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు
9. ఒక ఫొటో అప్లికేషన్ పైన అతికించి సంతకం చేయాలి.
పై అన్ని సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. వాటన్నింటినీ దరఖాస్తు ఫాంకు జతచేసి ఆ మొత్తం సర్టిఫికెట్లను నవంబర్ 28, 2022 లోపు కార్యాలయ సమయంలో O/o. DM&HO, Hyderabad, 4th floor, GHMC Building, Patny, Secunderabad చిరునామాలో నేరుగా వెళ్లి అందజేయాలి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: నవంబర్ 28, 2022
– Staff Nurse MPHA Jobs
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…