Subject Associates Jobs : తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ మరియు ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Social, Tribal Welfare & Ekalavya Residential Educational Institutions Societies) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ మరియు ఏకలవ్య గురుకుల ప్రతిభ కళాశాలల్లో (COEs) ఇంటర్మీడిట్ తో పాటు IIT-JEE(Mains/Advanced)/NEET శిక్షణ ఇస్తున్న సీనియర్ ఫ్యాకల్టీకి సహాయంగా సబ్జెక్ట్ అసోసియేట్స్ (Part Time Subject Associates) ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదిక భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ (Rc.No.0245/OSD/OPE/2021) జారీ చేసింది. మొత్తం ఐదు సబ్జెక్టులలో 149 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష డెమో, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
1. గణితం (Maths) – 26
2. భౌతికశాస్త్రం (Physics) – 29
3. రసాయనశాస్త్రం (Chemistry) – 32
4. బోటనీ (Botany) – 30
5. జువాలజీ (Zoology) – 32
సంబంధిత సబ్జెక్టులో పరిజ్ఞానం, ఇంగ్లిష్ భాషలో కమ్యూనికేషన్ స్కిల్స్, JEE Mains/ Advanced, NEET, Eamcet బోధనలో సామర్థ్యాన్ని బట్టి అభ్యర్థులను సబ్జెక్ట్ అసోసియేట్స్ గా ఎంపిక చేస్తారు. బోధనలో కొత్త పద్ధతులు అవలంబించే వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఎంపిక ప్రక్రియలో మొత్తం 150 మార్కులకు గాను రాత పరీక్షకు 100 మార్కులు, డెమోకు 25 మార్కులు, ఇంటర్వ్యూకు 25 మార్కులు కేటాయిస్తారు.
రాత పరీక్షలో ప్రతి సబ్జెక్టులో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్క్ కట్ చేస్తారు. పరీక్ష ఒక గంట (60 నిమిషాలు) సమయంలో రాయాల్సి ఉంటుంది. రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో డెమో మరియు ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
Salary : నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు TTWREIS లేదా TSWREIS వెబ్ సైట్ (https://tgtwgurukulam.telangana.gov.in/), (www.tswreis.ac.in)
లోకి లాగిన్ కావాలి. అందులో Selection of Part Time Subject Associates in COES of TSWREIS, TTWREIS & TSES for the A.Y. 2022-23 నోటిఫికేషన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత కుడి పక్కన ఉన్న ఆప్షన్లలో Click here : To pay application Fee పై క్లిక్ చేయాలి. అందులో పేరు, పుట్టిన తేదీ ఫోన్ నెంబర్, జెండర్, సబ్జెక్టు తదితర వివరాలు నింపాలి. అనంతరం రూ.500 పరీక్ష ఫీజు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్,
డెబిట్ కార్డుల ద్వారా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి Click here : To submit online application పై క్లిక్ చేసి పుట్టిన తేదీ (Date of Birth), ఫోన్ నెంబర్ (Contact Number) ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫాం వస్తుంది. అందులో పూర్తి వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూలై 16, 2022 నుంచి
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 23, 2022
రాత పరీక్ష : జూలై 31, 2022 (ఆదివారం)
డెమో/ఇంటర్వ్యూ : ఆగస్టు 08, 2022
ఆగస్టు 10, 2022 లోపు పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు.
– Subject Associates Jobs
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…