Contract Job

Teacher Jobs in Atomic Energy Central Schools

Teacher Jobs in AECS : హైదరాబాద్ లోని ఈసీఐఎల్ (Electronics Corporation of India Limited-ECIL) కు చెందిన అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్క్ (Atomic Energy Central Schools)లో 2022-23 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పలు ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్(TGT), ప్రైమ‌రీ టీచ‌ర్స్(PRT) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (AECS/Hyd/Advertisement/Cont.Trs./2022) జారీ చేశారు. షార్ట్ లిస్టింగ్ (Short Listing), రాత పరీక్ష (Written Test), స్కిల్ టెస్ట్ (Skill Test) ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Details of Posts

1. TGT (Bio/Chemistry)
2. TGT (Social Science)
3. TGT (Hindi/Sanskrit)
4. TGT (PET) (Male & Female)
5. PRT (Primary Teachers)
6. PRT (Telugu)

Eligibility (TGT)

TGT (Bio/Chemistry):
బోటనీ/జువాలజీ/కెమిస్ట్రీ సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
అలాగే, ఏదైనా సైన్స్ సబ్జెక్ట్ టీచింగ్ సబ్జెక్టుగా బీ.ఈడీ (B.Ed) పూర్తి చేసిన వారు అర్హులు.

TGT (Social Science):
చరిత్ర(History), భౌగోళిక శాస్త్రం (Geography), ఆర్థికశాస్త్రం (Economics), రాజకీయశాస్త్రం (Political Science) లలో ఏవైనా రెండు సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. అందులో చరిత్ర, భౌగోళిక శాస్త్రం తప్పనిసరిగా ఉండాలి. అలాగే, సోషల్ సైన్స్ లో లేదా ఏదైనా సోషల్ సైన్స్ సబ్జెక్ట్ టీచింగ్ సబ్జెక్టుగా బీ.ఈడీ(B.Ed) పూర్తి చేసిన వారు అర్హులు.

TGT (Hindi/Sanskrit):
హిందీ లేదా సంస్కృతం ఒక సబ్జెక్టుగా మూడేళ్ల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే, హిందీ లేదా సంస్కృతం టీచింగ్ సబ్జెక్టుగా బీ.ఈడీ (B.Ed) పూర్తి చేసిన వారు అర్హులు.

TGT (PET) (Male & Female):
ఫిజికల్ ఎడ్యుకేషన్(Physical Education) లో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా, ఏదైనా విభాగంలో మూడేళ్ల గ్రాడ్యుయేషన్ చేసి, ఫిజికల్ ఎడ్యుకేషన్ లో రెండేళ్ల డిగ్రీ చేసిన వారు కూడా అర్హులే. అలాగే, ఇంగ్లిష్ మీడియంలో బోధించడంలో ప్రావీణ్యం ఉడాలి.

PRT

1.PRT (Primary Teachers):

  • ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా సీనియర్ సెకండరీ/హైయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ టెస్ట్/ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. అలాగే, గుర్తింపు పొందిన సంస్థలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) చేసి ఉండాలి. ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా సీనియర్ సెకండరీ/హైయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ టెస్ట్/ఇంటర్మీడియట్ పాసై.. గుర్తింపు పొందిన సంస్థలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ (B.El.Ed) చేసిన వారు కూడా అర్హులే.
  • ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా సీనియర్ సెకండరీ/హైయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ టెస్ట్/ఇంటర్మీడియట్ పాసై.. గుర్తింపు పొందిన సంస్థలో రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (D.Ed) చేసిన వారు కూడా అర్హులే.
  • ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేసి బ్యాచిరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

2. PRT (Primary Teachers):

  • తెలుగు ఒక సబ్జెక్టుగా సీనియర్ సెకండరీ/హైయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ టెస్ట్/ఇంటర్మీడియట్ లో పాస్ మార్కులు సాధించి, గుర్తింపు పొందిన సంస్థలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో రెండు సంవత్సరాల డిప్లొమా (D.El.Ed) చేసిన వారు అర్హులు.
  • తెలుగు ఒక సబ్జెక్టుగా సీనియర్ సెకండరీ/హైయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ టెస్ట్/ఇంటర్మీడియట్ పాసై, గుర్తింపు పొందిన సంస్థలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ (B.El.Ed) చేసిన వారు కూడా అర్హులే.
  • తెలుగు ఒక సబ్జెక్టుగా సీనియర్ సెకండరీ/హైయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ టెస్ట్/ఇంటర్మీడియట్ పానై.. గుర్తింపు పొందిన సంస్థలో రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (D.Ed) చేసిన వారు కూడా అర్హులే.
  • అలాగే, ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేసి బ్యాచిరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 8వ తరగతి వరకు తెలుగును 3వ భాషగా బోధించడంలో అనుభవం, సాధారణ తెలుగు వ్యాకరణం (Telugu grammar) పై అవగాహన కలిగి ఉండాలి.

Age Limit

టీజీటీ (TGT) అభ్యర్థుల వయసు ఏప్రిల్ 01, 2022 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
పీఆర్టీ (PRT) అభ్యర్థుల వయసు ఏప్రిల్ 01, 2022 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
ఓబీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, మహిళా అభ్యర్థులకు పది (10) సంవత్సరాలు
సడలింపు ఉంది. దివ్యాంగులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

Salary

టీజీటీ (TGT) అభ్యర్థులకు – నెలకు రూ.26,250. లేదా పీరియడ్ కు రూ.210. రోజుకు ఐదు (05) పీరియడ్ లకు మాత్రమే అనుమతి ఉంటుంది.
పీఆర్టీ (PGT) అభ్యర్థులకు – నెలకు రూ.21,250. లేదా పీరియడ్ కు రూ.170. రోజుకు ఐదు (05) పీరియడ్ లకు మాత్రమే అనుమతి ఉంటుంది.

How to Apply

ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ECIL కు చెందిన వెబ్ సైట్ (www.nfc.gov.in/ www.aecshyd.edu.net/ www.aecshyd2.edu.net/ www.amd.gov.in/ www.ecil.co.in)లలో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అంటించి అందులోని వివరాలన్నీ నింపాలి.
ఆ అప్లికేషన్ ఫాంకు విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన జిరాక్స్ కాపీలు జతచేసి ఆగస్టు 01, 2022 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 04, 2022 మధ్యాహనం 3 గంటల లోపు Security Office, entrance of DAE Colony, D-Sector Gate, Kamalanagar, ECIL Post, Hyderabad – 500062 చిరునామాలో ఏర్పాటు చేసిన బాక్స్ లో వేయాలి.
షార్ట్ లిస్ట్ చేసి అర్హులైన అభ్యర్థులను రాత పరీక్షకు ఆహ్వానిస్తారు. రాత పరీక్షలో ప్రతిభ చూపినవారిని స్కిల్ టెస్ట్ కు ఆహ్వానిస్తారు. అందులో ప్రతిభ
కనబరిచిన వారికి ఉద్యోగాలు కల్పిస్తారు.

వివరాల కోసం 040-27123363 నెంబర్ ను సంప్రదించవచ్చు.
వెబ్ సైట్: www.ecil.co.in

– Teacher Jobs in AECS

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago