Teaching Associates Jobs in MJPTBCWA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Teaching Associates Jobs in MJPTBCW : తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, వనపర్తి జిల్లా కేంద్రాల్లో గల మహాత్మా జ్యోతిబా పూలె బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో (MJPTBCW Residential Agricultural Degree Colleges for Women at Karimnagar & Wanaparthy) బీ.ఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సు విద్యార్థినులకు పాఠాలు బోధించేందుకు టీచింగ్ అసోసియేట్ (Teaching Associates) పోస్టుల భర్తీకి హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలె తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Mahatma Jyothiba Pule Telangana B.C. Welfare Residential Educational Institutions Society, Hyderabad) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఇరవై (20) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Departments & Vacancies

  • Agronomy – 04
  • Genetics & Plant Breeding – 02
  • Soil Science & Agriculture Chemistry – 02
  • Entomology – 02
  • Plant Pathology – 02
  • Horticulture – 02
  • Agricultural Engineering – 02
  • Agricultural Economics – 02
  • Agricultural Extension – 02

Qualification

  • M.Sc.(Agriculture/Horticulture/Agril.Engineering/Agril.Statistics)
  • అలాగే, కంప్యూటర్ పరిజ్ఞానం (M.S.Office, Power Point, Excel etc) కూడా ఉండాలి.

Remuneration

  • పీ.హెచ్.డీ చేసిన వారికి నెలకు రూ.45,000
  • ఎమ్మెస్సీ చేసిన వారికి రూ.40,000

How to Apply

  • అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు మహాత్మా జ్యోతిబా పూలె తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీకి చెందిన వెబ్ సైట్ (https://mjptbcwreis.telangana.gov.in) ను ఓపెన్ చేయాలి.
  • అందులో స్క్రోల్ అవుతున్న (Application for Guest Faculty) పై క్లిక్ చేయాలి.
  • నిర్ణీత ఫర్మాట్ లో ఉన్న అప్లికేషన్ ఫాం వస్తుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి.
  • ఆ అప్లికేషన్ ఫాంను స్కాన్ చేసి mjpadmissi [email protected] కు సెండ్ చేయాలి.
  • దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో సెండ్ చేసిన అప్లికేషన్ ఫాం తో పాటు విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ లను జిరాక్స్ తీసుకొని
    వాటిని గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయించి తీసుకెళ్లాలి.
  • అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా తీసుకెళ్లాలి.

Place & Date of interview

Dates : 14th & 15th December, 2022
Place : 6th Floor, DSS Bhavan, Masabtank, Hyderabad
Time : from 11.00 am onwards

Important Points

  • పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • తాత్కాలిక ప్రాతిపదికన, గెస్ట్ బేసిస్ లో భర్తీ చేస్తారు.
  • ఇంటర్వ్యూకు హాజరైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు రావు.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యేవారికి టీఏ, డీఏ లాంటివి ఇవ్వరు.
  • మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.

– Teaching Associates Jobs in MJPTBCW