Contract Job

Technical Officer Staff Nurse Jobs in AIIA

Technical Officer Staff Nurse Jobs : భారత ప్రభుత్వానికి చెందిన బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (Broadcast Engineering Consultarts India Limited-BECIL) ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (All India Institute of Ayurveda-AIIA) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (File No. BECIL/MR-1/AIIA/Advt2022/158) జారీ చేసింది. ఇందులో టెక్నికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, మిడ్ వైఫ్, ఆపరేషన్ థియేటర్ నర్స్, డెంటల్ హైజినీస్ట్, ఆడియోవిజువల్ గ్రాఫిక్స్, వార్డ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Details of Posts

1. టెక్నికల్ ఆఫీసర్ (ఆయుర్వేద)
2. స్టాఫ్ నర్స్
3. మిడ్ వైఫ్
4. ఆపరేషన్ థియేటర్ నర్స్
5. డెంటల్ హైజినీస్ట్
6. ఆడియోవిజువల్ గ్రాఫిక్స్
7. వార్డ్ అటెండెంట్

Technical Officer (Ayu)

పోస్టు పేరు: టెక్నికల్ ఆఫీసర్ (ఆయుర్వేద)
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు
జీతం: నెలకు రూ.50,000
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఎండీ ( ఆయుర్వేద) చేసి ఉండాలి. కంప్యూటర్ లో ఎంఎస్ ఆఫీస్ లో పనిచేయగలగాలి.

Staff Nurse

పోస్టు పేరు: స్టాఫ్ నర్స్
పోస్టుల సంఖ్య: ఇరవై (20)
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.37,500
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో బీ.ఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. అలాగే, ప్రముఖ ఆసుపత్రి/నర్సింగ్ హోంలో రెండు (02) సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో ఎమ్మెస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. అలాగే, ప్రముఖ ఆసుపత్రి/నర్సింగ్ హోంలో ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (GNM) చేసి ఉండాలి. అలాగే, ప్రముఖ ఆసుపత్రి/నర్సింగ్ హోంలో నాలుగు (04) సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.

Mid-Wife

పోస్టు పేరు: మిడ్ వైఫ్
పోస్టుల సంఖ్య ఒకటి (01)
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.37,500
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థలో బీ.ఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. అలాగే, ప్రముఖ ఆసుపత్రి/ నర్సింగ్ హోంలో రెండు (02) సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో ఎమ్మెస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. అలాగే, ప్రముఖ ఆసుపత్రి/సర్సింగ్ హోంలో ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (GNM) చేసి ఉండాలి. అలాగే, ప్రముఖ ఆసుపత్రి/నర్సింగ్ హోంలో నాలుగు (04) సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.

Operation Theatre Nurse

పోస్టు పేరు: ఆపరేషన్ థియేటర్ నర్స్
పోస్టుల సంఖ్య: మూడు (03)
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.37,500
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో బీ.ఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. అలాగే, ప్రముఖ ఆసుపత్రి/ నర్సింగ్ హోంలో రెండు (02) సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో ఎమ్మెస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. అలాగే, ప్రముఖ ఆసుపత్రి/నర్సింగ్ హోంలో ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (GNM) చేసి ఉండాలి. అలాగే, ప్రముఖ ఆసుపత్రి/నర్సింగ్ హోంలో నాలుగు (04) సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.

Dental Hygienist

పోస్టు పేరు: డెంటల్ హైజినీస్
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.30,000
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీలో బయాలజీ సబ్జెక్టుతో 10+2 లేదా ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. అలాగే, గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సిటీలో డెంటల్ హైజినీలో డిప్లొమా చేసి సంబంధిత విభాగంలో మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి. స్టేట్ డెంటల్ కౌన్సిల్/డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.

Audiovisual Graphics

పోస్టు పేరు: ఆడియోవిజువల్ గ్రాఫిక్స్
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.20,000
అర్హతలు: 10+2తో పాటు ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇనుస్ట్రుమెంట్స్ మెకానిక్స్ లలో రెండేళ్ల ఐటీఐ చేసి ఉండాలి. అదేవిధంగా ఆడియో వీడియో ఎక్విప్మెంట్ టెక్నీషియన్ గా రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.

Ward Attendant

పోస్టు పేరు: వార్డ్ అటెండెంట్.
పోస్టుల సంఖ్య: తొమ్మిది (09)
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: ఢిల్లీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస వేతనం ఇస్తారు.
అర్హతలు: 8వ తరగతి పాసై ప్రముఖ ఆసుపత్రి లేదా నర్సింగ్ హోంలో ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం ఉండాలి.

How to Apply

ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ముందుగా BECIL వెబ్ సైట్ (www.becil.com) లేదా (https://becilregistration.com) ఓపెన్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేసి Careers పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కింద ఉన్న ఆప్షన్లలో Registration Form (Online) పై క్లిక్ చేయాలి. అందులో New Registration పై క్లిక్ చేయాలి. Step 1 application Form ఓపెన్ అవుతుంది. దానిలోని వివరాలన్నీ నింపాలి. ఆ తర్వాత Step2లో బేసిక్ డిటేల్స్ ఇవ్వాలి. అనంతరం Step 3 లో విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన వివరాలు నింపాలి. ఆ తర్వాత Step 4లో స్కాన్ చేసిన రీనెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం, పుట్టిన తేదీ/ ఎస్సెస్సీ సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత Step 5లో వివరాలన్నీ చెక్ చేసుకోవాలి.

Step 6లో రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు, దివ్యాంగులు రూ.450 చెల్లించాలి. ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేస్తే జనరల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులు ఒక్కో పోస్టుకు అదనంగా రూ.500 చెల్లించాలి. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులు, దివ్యాంగులు రూ.300 అదనంగా చెల్లించాలి. రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లించాలి. అనంతరం అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.

అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. అనంతరం నెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హతలు, కేటగిరీ, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లికేషన్ ఫాంకు జతచేయాలి. వాటన్నింటినీ సింగిల్ ఫైల్ చేసి అప్లికేషన్ ఐడీ+పేరును ఫైల్ నేమ్ గా ఇవ్వాలి. అనంతరం పీడీఎఫ్ ఫార్మాట్ లో hrsection@becil.com కు మెయిల్ చేయాలి. సబ్జెక్టులో అడ్వటైజ్మెంట్ నెంబర్, పోస్టు పేరు ఇవ్వాలి.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసే సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే టెక్నికల్ సమస్యల పరిష్కారం కోసం khuswindersingh@becil.com కు, ఇతర సమస్యల పరిష్కారం కోసం sayogta@becil.com కు మెయిల్ చేసి పరిష్కారం పొందవచ్చు. అలాగే, 0120-4177860 నెంబర్ కు
ఫోన్ చేసి కూడా పరిష్కారం పొందవచ్చు.

Important Points

  • ఇవి పూర్తిగా కాంట్రాక్టు ఉద్యోగాలు.
  • ఎంపికైన అభ్యర్థులు ఆరు (06) నెలలపాటు పనిచేయాల్సి ఉంటుంది.
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అలాగే, ఉద్యోగంలో జాయిన్ అయ్యేందుకు వచ్చే సమయంలో ఎలాంటి టీఏ, డీఏ ఇవ్వరు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోనే హాజరు కావాల్సి ఉంటుంది.
  • అప్ లోడ్ చేయాల్సిన రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం, పుట్టిన తేదీ/ఎస్సెస్సీ సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్ సైజ్ 100 కేబీ కంటే ఎక్కువగా ఉండకూడదు.
  • అభ్యర్థులు ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ను మాత్రమే ఇవ్వాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తేదీలు ఆన్ లైన్ అప్లికేషన్ ఫాంలో ఇచ్చిన ఈమెయిల్ కు మాత్రమే పంపిస్తారు.
  • ఈ ఎంపిక ప్రక్రియ ముగిసే వరకు ఇతర సమాచారం కోసం అభ్యర్థులు తరచూ BECIL వెబ్ సైట్ను చూస్తుండాలి.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూలై 10, 2022 (ఆదివారం)

– Technical Officer Staff Nurse Jobs

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago