TGT SBGTT PET Warden Jobs

TGT SBGTT PET Warden Jobs : తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ (Department for Welfare of Disabled and Senior Citizens, Telangana State) రాష్ట్రంలోని అంధులు, బధిరుల గురుకుల పాఠశాలలు, దివ్యాంగుల వసతి గృహాల్లో టీజీటీ, ఎస్జీబీటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఎంపికైన అభ్యర్థులు అంధులు, బధిరుల ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, దివ్యాంగుల వసతి గృహాలలో పనిచేయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు అన్ లైన్ మరియు అఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

1. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)
2. సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రెయిన్డ్ టీచర్ (ఎస్జీబీటీ)
3. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
4. వార్డెన్

Trained Graduate Teachers (TGT)

పోస్టుల సంఖ్య: పదిహేను (15)
(ప్రభుత్వ అంధుల గురుకుల పాఠశాల, కరీంనగర్ – 03, ప్రభుత్వ అంధుల గురుకుల పాఠశాల, మహబూబ్ నగర్ – 03, ప్రభుత్వ బధిరుల గురుకుల పాఠశాల, కరీంనగర్ – 03, ప్రభుత్వ బధిరుల గురుకుల పాఠశాల, మిర్యాలగూడ – 03)
అర్హతలు: ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ పూర్తిచేసి, బీఈడీ చేసి ఉండాలి. అలాగే, అంధులు/బధిరులకు బోధించేందుకు గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి ఏడాది వ్యవధిగల టీచర్ ట్రెయినింగ్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు అంధులు మరియు బధిరులకు ఇంగ్లిష్ మీడియంలోనే బోధించాల్సి ఉంటుంది.
వయసు: జూలై 1, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.35,000

Secondary Grade Basic Trained Teachers (SGBTT)

పోస్టుల సంఖ్య: పదిహేను (15)
(ప్రభుత్వ అంధుల గురుకుల పాఠశాల, కరీంనగర్ – 03, ప్రభుత్వ అంధుల గురుకుల పాఠశాల, మహబూబ్ నగర్ – 03, ప్రభుత్వ బధిరుల గురుకుల పాఠశాల, కరీంనగర్ – 03, ప్రభుత్వ బధిరుల గురుకుల పాఠశాల, మిర్యాలగూడ – 03)
అర్హతలు: ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. అలాగే, అంధులు/బధిరులకు బోధించడంలో గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ లో ఏడాది శిక్షణ పొంది ఉండాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు అంధులు మరియు బధిరులకు ఇంగ్లిష్ మీడియంలోనే బోధించాల్సి ఉంటుంది.
వయసు: జూలై 1, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000

Physical Education Teachers (PET)

పోస్టుల సంఖ్య: రెండు (02)
ప్రభుత్వ బధిరుల గురుకుల పాఠశాల, కరీంనగర్ – 1,
ప్రభుత్వ బధిరుల గురుకుల పాఠశాల, మిర్యాలగూడ – 1.
అర్హతలు: హైదరాబాద్ లోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.
వయసు: జూలై 1, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000

Warden

పోస్టుల సంఖ్య: పది (10) (హైదరాబాద్ జిల్లా-05, రంగారెడ్డి జిల్లా-05)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ పూర్తిచేసి, బీఈడీ చేసి ఉండాలి. లేదా ఎంఏ(సోషల్ వర్క్), ఎంఏ(సోషియాలజీ) చేసిన వారు లేదా ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ పూర్తిచేసి సోషల్ వర్క్, సోషియాలజీలో డిప్లొమా చేసిన వారు కూడా అర్హులే. అలాగే, D.Ed (HH/VH) లేదా Special B.Ed (VH/HH) చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జూలై 1, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.35,000

Important Points

  • అంధుల కేటగిరీలో ఎంపికైన ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రెయిన్డ్ టీచర్స్ కరీంనగర్ మరియు మహబూబ్ నగర్ ప్రభుత్వ అందుల గురుకుల పాఠశాలల్లో పనిచేయాల్సి ఉంటుంది.
  • బధిరుల కేటగిరీలో ఎంపికైన ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రెయిన్డ్ టీచర్స్ కరీంనగర్, మిర్యాలగూడ, హైదరాబాద్ లోని ప్రభుత్వ బధిరుల గురుకుల పాఠశాలల్లో పనిచేయాల్సి ఉంటుంది.
  • వార్డెన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నియంత్రణలోని వసతి గృహాలు, అలాగే, రంగారెడ్డి జిల్లాలోని స్త్రీ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి నియంత్రణలోని వసతి గృహాలలో పనిచేయాల్సి ఉంటుంది.
  • ఇవి స్వల్పకాలిక కాంట్రాక్టు ఉద్యోగాలు. ఎంపికైన అభ్యర్థులు ఆరు నెలల కాలం లేదా ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులను ఎంపిక చేసే వరకు పనిచేయాల్సి ఉంటుంది.

How to Apply

ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ వెబ్ సైట్ (https://wdsc.telangana.gov.in/) ను ఓపెన్ చేసి అందులో కుడివైపున కనిపిస్తున్న నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ ఫాం ఓపెన్ అవుతాయి. దానిని డౌన్ లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫాంను ప్రింట్ తీసుకోవాలి. అందులో అభ్యర్థి పూర్తి పేరు, తండ్రి/భర్త పేరు,  పుట్టిన తేదీ/ వయసు (జూలై 1, 2022 నాటికి), ప్రస్తుత చిరునామా, శాశ్వత చిరునామా, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, విద్యార్హతలు, వైకల్యంనకు సంబంధించిన వివరాలు నింపాలి.
అలాగే, ఆ అప్లికేషన్ ఫాంకు ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కు సంబంధించిన మెమోలు, అనుభవం, వైలకంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కు సంబంధించి ఎన్సెస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి మార్కుల మెమోలు జతచేయాలి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కు సంబంధించిన డీఈడీ, బీఈడీ, డీపీఈడీ, బీపీఈడీ మార్కుల మెమోలు జతచేయాలి. దివ్యాంగులు వైకల్యంనకు సంబంధించిన సదరమ్ సర్టిఫికెట్ జతచేయాలి.

పై అన్ని సర్టిఫికెట్లు జూలై 14, 2022 తేదీలోపు చేరేలా తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయానికి పోస్టు
ద్వారా గానీ, ఈ-మెయిల్ ఐడీకి గానీ పంపించాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Director,
Welfare of Disabled and Senior Citizens,
Nalgonda X Roads, Malakpet,
Hyderabad – 36.

ఈ-మెయిల్ ఐడీ
[email protected]
[email protected]

సందేహాల నివృత్తికి 040-24559048 నెంబర్ కు ఫోన్ చేయవచ్చు.

Website – wdsc.telangana.gov.in

– TGT SBGTT PET Warden Jobs