Young Professional Accounts JobsA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Young Professional Accounts Jobs : హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (National Institute of Rural Development & Panchayatiraj – NIRD&PR) యంగ్ ప్రొఫెషనల్స్ (అకౌంట్స్) (Young Professional (Accounts)) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No.40/2022) జారీ చేసింది. మొత్తం ఐదు (05) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Qualifications

  • ఎంబీఏ (ఫైనాన్స్) (MBA (Finance)) లేదా ఎం.కాం (M.Com) లేదా సీఏ (CA) లేదా ఐసీడబ్ల్యూఏ (ఇంటర్) (ICWA (Inter) చేసిన వారు అర్హులు.
  • ట్యాలీ ప్రైమ్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ లో పరిజ్ఞానం ఉండాలి.
  • ఎంబీఏ (ఫైనాన్స్), ఎం.కాం చేసిన వారు ప్రముఖ సంస్థలో అకౌంట్స్ మరియు ట్యాలీలో ఐదు (05) సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
  • సీఏ, ఐసీడబ్ల్యూఏ చేసిన వారు ప్రముఖ సంస్థలో అకౌంట్స్ (ఆర్టికల్ అనుభవం మినహా) మరియు ట్యాలీలో రెండు (12) సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
  • ఇంగ్లిష్ మరియు హిందీ భాషలలో మంచి కమ్యూనికేషన్ స్కిల్క్ కూడా ఉండాలి.

Age Limit

ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు 40 సంవత్సరాల లోపు ఉండాలి.

Salary

జీతం నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

Application Fee

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు నిమిత్తం రూ.300 చెల్లించాలి.
ఈ ఫీజు డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్) రూపంలో చెల్లించాలి.
NIRD&PR పేరిట హైదరాబాద్ లో చెల్లుబాటు అయ్యేలా డీడీ తీయాలి.
డీడీ వెనక భాగంలో అభ్యర్థి పూర్తిపేరు, అప్లికేషన్ నెంబర్ రాయాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

How to Apply

ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ కు చెందిన వెబ్ సైట్ (http://career.nirdpr.in/) ను ఓపెన్ చేయాలి. అందులో NIRD&PR Invites applications for the post of “Young Professional (Accounts)” on contract basis పక్కన ఉన్న Apply Online పై క్లిక్ చేసి Young Professional (Accounts) పక్కన ఉన్న Register & Apply క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత ఆన్ లైన్ దరఖాస్తు ఫాంను సబ్మిట్ చేయాలి. ఆన్ లైన్ దరఖాస్తును విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫాంను ప్రింట్ తీసుకొని, దానికి డీడీని జతచేసి అక్టోబర్ 27, 2022 లోపు National Institute Of Rural Development & Panchayati Raj, Rajendranagar, Hyderabad – 500 030. చిరునామాకు పంపించాలి.

Important Points

ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైన.
కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పాటు పనిచేయాల్సి ఉంటుంది.
అభ్యర్థుల పనితీరు, ఇనిస్టిట్యూట్/ ప్రాజెక్ట్ అవసరాన్నిబట్టి పొడిగించవచ్చు.
ఈ ఎంపికకు సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు తరచూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ వెబ్
సైట్ ను చూస్తుండాలి.

Important Dates

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 20, 2022 (సాయంత్రం 5:30 గంటల వరకు)
సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫాం, డీడీ చేరాల్సిన చివరి తేదీ: అక్టోబర్ 27, 2022

– Young Professional Accounts Jobs