Jobs in Bharat Dynamics Limited : హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గల భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defence, Government of India)కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (Bharat Dynamics Limited - BDL) ప్రాజెక్ట్ ఇంజినీర్ (Project Engineer) / ప్రాజెక్ట్ ఆఫీసర్ (Project Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం వంద (100) పోస్టుల భర్తీకి ప్రకటజ విడుదల చేసింది. విద్యార్హతల మార్కుల్లో మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లోని బీడీఎల్ కార్పొరేట్ ఆఫీస్, సంగారెడ్డిలోని భానూర్ యూనిట్, కంచన్‌బాగ్‌లోని యూనిట్ ఆఫీస్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం యూనిట్, కర్నాటకలోని బెంగళూరు, కేరళలోని కొచ్చి, మహారాష్ట్రలోని ముంబై యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
Details of Posts
మొత్తం పోస్టులు వంద (100). ఇందులో అన్ రిజర్వుడ్ () కేటగిరీకి - 45, ఎస్సీ – 15, ఎస్టీ – 07, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) – 23, ఈడబ్ల్యూఎస్‌కు – 10 కేటాయించారు. అలాగే, మొత్తం పోస్టులలో పీడబ్ల్యూడీ (PwBD) VI – 02, HI – 02, OI – 01, MD – 01 కేటాయించారు.
Corporate Office, Hyderabad, Telangana
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్సెస్) – 01
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (బిజినెస్ డెవలప్మెంట్) – 02
Kanchanbagh Unit, Hyderabad, Telangana
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) – 17
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్) – 19
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్) – 04
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్సెస్) – 01
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఫైనాన్స్) – 01
Bengaluru-Karnataka
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) – 03
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్) – 02
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్) – 02
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్సెస్) – 01
Bhanur Unit, Sangareddy Dist, Telangana
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) – 11
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్) – 08
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (సివిల్) – 02
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్) – 02
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) – 02
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (కెమికల్) – 06
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్సెస్) – 01
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఫైనాన్స్) – 01
Visakhapatnam Unit, Andhra Pradesh
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్) – 01
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) – 03
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్) – 04
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్సెస్) – 02
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఫైనాన్స్) – 01
Kochi, Kerala
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్) – 01
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) – 01
Mumbai, Maharashtra
- ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్) – 01
Age Limit
ఈ పోస్టులకు అన్‌రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల వయసు మే 10, 2023 నాటికి 28 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్ ) అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, అన్‌రిజర్వుడ్ దివ్యాంగులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్ ) దివ్యాంగులకు ఎనిమిది సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు పది సంవత్సరాలు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది.
Salary
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.30 వేలు ఇస్తారు. రెండో సంవత్సరం రూ.33 వేలు, మూడో సంవత్సరం రూ. 36 వేలు, నాలుగో సంవత్సరం రూ.39 వేలు చెల్లిస్తారు.
Qualification and Experience
పై పోస్టులకు అభ్యర్థులు సంబంధిత విభాగాలలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్ (60 శాతం మార్కులు)లో పాసై ఉండాలి. అలాగే, ఆయా డిపార్ట్మెంట్లలో అనుభవం కూడా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు 55 శాతం మార్కులు సాధించినా సరిపోతుంది.
How to Apply
ఈ పోస్టులకు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) కు చెందిన వెబ్సైట్ (https://bdl.india.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం, విద్యార్హతలు, క్యాస్ట్, ఎక్స్‌పీరియెన్స్ ఇతర అన్ని సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. అలాగే, రూ.300 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Selection Criteria
అభ్యర్థులు విద్యార్హతల్లో సాధించిన మార్కులకు 75 పాయింట్లు, ఎక్స్‌పీరియెన్స్‌కు 10 పాయింట్లు, ఇంటర్వ్యూకు 15 పాయింట్లు కేటాయిస్తారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులను 1:10 రేషియోలో ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులు లిస్టు, కాల్ లెటర్స్ జులై 5, 2023న బీడీఎల్ వెబ్సైట్లో పెడతారు. వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా సమాచారం పంపించరు.
కార్పొరేట్ ఆఫీస్, కంచన్‌బాగ్ యూనిట్, బెంగళూరు యూనిట్‌లోని పోస్టులకు కంచన్‌బాగ్ యూనిట్ (BDL-Kanchanbagh Unit, Hyderabad, Telangana – 500 058)లో, భానూర్ యూనిట్‌లోని పోస్టులకు భానూర్ యూనిట్ (BDL-Bhanur Unit, Patancheru Mandal, Sangareddy Dist., Telangana -502 305)లో, విశాఖపట్నం, కొచ్చి, ముంబై యూనిట్లలోని పోస్టులకు విశాఖపట్నం (BDL-Visakhapatnam Unit, ‘G’-Block,
APIIC-IALA, VSEZ Post, Visakhapatnam, Andhra Pradesh – 530049.)లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
Important Dates
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం – మే 24, 2023 మధ్యాహ్నం 2 గంటల నుంచి
- దరఖాస్తులకు చివరి తేదీ – జూన్ 23, 2023 (సాయంత్రం 5 గంటల వరకు)
- కాల్ లెటర్స్ డౌన్లోడ్ – జులై 5, 2023 (సాయంత్రం 4 గంటల నుంచి)
- ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ : జులై రెండో వారం నుంచి..
– Jobs in Bharat Dynamics Limited