Nurses and Paramedics JobsA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Nurses and Paramedics Jobs : భారత ప్రభుత్వ నవరత్న సంస్థ అయిన నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (Neyveli Lignite Corporation-NLC) ఇండియా లిమిటెడ్ నర్సులు, పారామెడికల్ (Nurses and Paramedics) సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No:03/2023)​ విడుదల చేసింది. మొత్తం 103 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

1.నర్సులు (Nurses)
2.ఫిజియోథెరపిస్ట్(Physiotherapist)
3.ఎమర్జెన్సీ కేర్ టెక్నీషియన్(Emergency Care Technician)
4.డయాలసిస్ టెక్నీషియన్(Dialysis Technician)
5.ల్యాబ్ టెక్నీషియన్(Lab Technician)
6.రేడియోగ్రాఫర్(Radiographer)
7.పంచకర్మ (ఆయుర్వేదం) అసిస్టెంట్(Panchakarma (Ayurveda) Assistant)
8.మెటర్నిటీ అసిస్టెంట్(Maternity Assistant)
9.ఫిమేల్ నర్సింగ్ అసిస్టెంట్(Female Nursing Assistant)
10.మేల్​ నర్సింగ్ అసిస్టెంట్(Male Nursing Assistant)

నర్సులు (Nurses) :

మొత్తం ఖాళీలు : 20
అన్​రిజర్వుడ్​(UR) – 10, ఓబీసీ (నాన్​ క్రిమీలేయర్​) ‌‌‌‌- 05, ఎస్సీ (SC) – 03, ఈడబ్ల్యూఎస్​ (EWS) – 02
జీతం : నెలకు రూ.36,000
అర్హతలు :
స్టేట్​ లేదా ఇండియన్​ నర్సింగ్​ కౌన్సిల్​ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థలో డిప్లొమా ఇన్​ జనరల్​ నర్సింగ్​ అండ్​ మిడ్ (DGNM)​ ఫైపరీతో పాటు బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్​ లో నర్స్​ అండ్​ మిడ్​వైఫ్​గా రిజిస్టర్​ చేసుకొని ఉండాలి.
ప్రభుత్వ/ ప్రైవేటు హాస్పిటళ్లు, ఎన్ఎల్​సీ ఇండియా లిమిటెడ్​లో పనిచేసి.. పదవీ విరమణ చేసిన నర్సులు, పారామెడికల్ సిబ్బంది కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫిజియోథెరపిస్ట్ (Physiotherapist)

మొత్తం ఖాళీలు : 02 (అన్​రిజర్వుడ్)
జీతం : నెలకు రూ.36,000
అర్హతలు : బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (BPT) లేదా మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (MPT) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎమర్జెన్సీ కేర్ టెక్నీషియన్ (Emergency Care Technician) :

మొత్తం ఖాళీలు : 05 (అన్​రిజర్వుడ్​ – 04, ఓబీసీ (నాన్​ క్రిమీలేయర్​) ‌‌‌‌- 01)
జీతం : నెలకు రూ.34,000
అర్హతలు : ఎమర్జెన్సీ కేర్ టెక్నాలజీ/ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ/ యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్ టెక్నాలజీ/క్రిటికల్ కేర్ టెక్నాలజీలో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

డయాలసిస్ టెక్నీషియన్(Dialysis Technician) :

మొత్తం ఖాళీలు : 02 (అన్​రిజర్వుడ్​ )
జీతం : నెలకు రూ.34,000
అర్హతలు : డయాలసిస్ టెక్నాలజీ/ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ/ డయాలసిస్ థెరపీ/బి.వొకేషనల్ (రీనల్ డయాలసిస్ టెక్నాలజీ)లో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

ల్యాబ్ టెక్నీషియన్(Lab Technician) :

మొత్తం ఖాళీలు : 04 (అన్​రిజర్వుడ్​ – 03, ఓబీసీ (నాన్​ క్రిమీలేయర్​) ‌‌‌‌- 01)
జీతం : నెలకు రూ.34,000
అర్హతలు : బీ.ఎస్సీ (ఎంఎల్​టీ) B.Sc(MLT) ఉత్తీర్ణులై ఉండాలి.

రేడియోగ్రాఫర్(Radiographer) :

మొత్తం ఖాళీలు : 03 (అన్​రిజర్వుడ్)
జీతం : నెలకు రూ.34,000
అర్హతలు : రేడియోలజీ అండ్ ఇమేజింగ్ సైన్స్ టెక్నాలజీ/ మెడికల్ రేడియోలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ రేడియోలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ/ మెడికల్ టెక్నాలజీ (రేడియోలజీ అండ్ అండ్ ఇమేజింగ్)/రేడియోగ్రఫీలో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

పంచకర్మ (ఆయుర్వేదం) అసిస్టెంట్ (Panchakarma (Ayurveda) Assistant) :

మొత్తం ఖాళీలు : 04 (అన్​రిజర్వుడ్​ – 03, ఓబీసీ (నాన్​ క్రిమీలేయర్​) ‌‌‌‌- 01)
జీతం : నెలకు రూ.25,000
అర్హతలు : ఏడాది/రెండేళ్ల వ్యవధి ఉండే పంచకర్మ థెరపీ కోర్సు పాసవ్వాలి. లేదా రెండేళ్లు అంతకంటే ఎక్కువ వ్యవధి ఉన్న పంచకర్మ థెరపీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

మెటర్నిటీ అసిస్టెంట్(Maternity Assistant) :

మొత్తం ఖాళీలు : 05 (అన్​రిజర్వుడ్​ – 04, ఓబీసీ (నాన్​ క్రిమీలేయర్​) ‌‌‌‌- 01)
జీతం : నెలకు రూ.25,000
అర్హతలు : ఇంటర్మీడియట్ పాసై రెండేళ్ల ఆగ్జిలరీ నర్స్ మిడ్వైఫ్ ట్రెయినింగ్
పూర్తిచేయాలి. లేదా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ చేయాలి. నర్సెస్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిస్​లో రిజిస్టర్​ చేసుకొని ఉండాలి.

మేల్ నర్సింగ్ అసిస్టెంట్(Female Nursing Assistant) :

మొత్తం ఖాళీలు : 36 అన్​రిజర్వుడ్​ – 18, ఓబీసీ (నాన్​ క్రిమీలేయర్​) ‌‌‌‌- 09, ఎస్సీ (SC) – 06, ఈడబ్ల్యూఎస్​ (EWS) – 03
జీతం : నెలకు రూ.25,000
అర్హతలు : పదో తరగతి లేదా సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పాసవ్వాలి. నర్సింగ్ అసిస్టెంట్/ మల్టీపర్సస్ హాస్పిటల్ వర్కర్​గా ఏడాది వ్యవధి ఉన్న పారామెడికల్
సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేయాలి.

ఫిమేల్ నర్సింగ్ అసిస్టెంట్(Female Nursing Assistant) :

మొత్తం ఖాళీలు : 22 అన్​రిజర్వుడ్​ – 11, ఓబీసీ (నాన్​ క్రిమీలేయర్​) ‌‌‌‌- 05, ఎస్సీ (SC) – 04, ఈడబ్ల్యూఎస్​ (EWS) – 02
జీతం : నెలకు రూ.25,000
అర్హతలు : పదో తరగతి లేదా సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పాసవ్వాలి. నర్సింగ్ అసిస్టెంట్/ మల్టీపర్సస్ హాస్పిటల్ వర్కర్​గా ఏడాది వ్యవధి ఉన్న పారామెడికల్
సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేయాలి.

Selection Procedure

  • రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
  • క్వశ్చన్​ పేపర్​ 100 మార్కులకు ఉంటుంది. ప్రతి జవాబుకు ఒక మార్కు ఉంటుంది.
  • నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష రెండు గంటలలో రాయాలి
  • ఆబ్జెక్టివ్ విధానంలోని ప్రశ్నలు అభ్యర్థుల సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటాయి.
  • రాత పరీక్షలో పాసవ్వాలంటే అన్​రిజర్వుడ్​, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాలి.
  • ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ (నాన్​ క్రిమీలేయర్​)/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సంపాదిస్తే సరిపోతుంది.
  • ప్రాథమిక దశలో ఎంపికైన అభ్యర్థులు ప్రీ ఎంప్లాయిమెంట్ మెడికల్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.

How to Apply

అభ్యర్థులు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్​కు చెందిన వెబ్​సైట్​ (https://www.nicindia.in/new_website/index.htm)లోకి లాగిన్​ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు.
అవసరమైన సర్టిఫికెట్లు అప్​లోడ్ చేయాలి.
దరఖాస్తు ఫీజు రూ.486 చెల్లించాలి. ప్రతి పోస్టుకూ దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీసెమెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. కానీ వీరు ప్రాసెసింగ్ ఫీజు రూ.236 చెల్లించాలి.
ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ప్రతి పోస్టుకూ ప్రత్యేకంగా దరఖాస్తు నింపాలి.

ఆన్​లైన్​ దరఖాస్తుకు చివరి తేదీ: 01.06.2023

Important Points

  • ఎంపికైనవారికి తమిళనాడులోని నైవేలిలో ఉన్న 350 పడకల జనరల్ హాస్పిటల్​లో ఉద్యోగాలు కల్పిస్తారు.
  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు మూడు సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులకు ప్రాంతీయ/ స్థానిక భాష తెలిసి ఉండాలి.
  • స్థానిక భాష అయిన తమిళాన్ని పదోతరగతి/ మెట్రిక్యులేషన్​లో ఒక సబ్జెక్టుగా చదివినట్టుగా సర్టిఫికెట్ సమర్పించాలి.
  • అభ్యర్థుల వయసు 55 ఏళ్లు మించకూడదు. స్పెషల్​ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
  • ఎంపికైనవారికి నెల వేతనంతోపాటు ప్రావిడెంట్ ఫండ్/ గ్రాట్యుటీ, వైద్య సదుపాయాలు, లీవులు, ఆఫీస్ టూర్లకు వెళ్లినప్పుడు టీఏ/ డీఏ, బోర్డింగ్ ఛార్జీలు, వసతి సదుపాయం లేదా హెచ్ఎస్ఏ అలవెన్స్ చెల్లిస్తారు.

– Nurses and Paramedics Jobs