Jobs in ESI DispensariesA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Jobs in ESI Dispensaries : తెలంగాణ ప్రభుత్వ బీమా వైద్య సేవల శాఖ (Government of Telangana Insurance Medical Services) ఆధ్వర్యంలో నిర్మల్​, నిజామాబాద్​ జిల్లాల్లో నడుస్తున్న ఈఎస్​ఐ (ESI) డిస్పెన్సరీలు, డయాగ్నస్టిక్​ సెంటర్లలో సివిల్​ అసిస్టెంట్​ సర్జన్ (Civil Assistant Surgeon(CAS))​, ఫార్మాసిస్ట్ (Pharmacist), ల్యాబ్​ టెక్నీషియన్ (Lab Technician) పోస్టుల భర్తీకి వరంగల్​​లోని ఇన్సూరెన్స్​ మెడికల్​ సర్వీసెస్ జాయింట్​ డైరెక్టర్ కార్యాలయం (O/o. The Joint Director, Insurance Medical Services, Warangal)​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. మొత్తం ఏడు (07) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేశారు. విద్యార్హతల్లో మెరిట్​ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Vacancies

సివిల్​ అసిస్టెంట్​ సర్జన్​ (Civil Assistant Surgeon)

  • మొత్తం పోస్టులు : రెండు (02)
  • ఈఎస్​ఐ డిస్పెన్సరీ, నిర్మల్​ – 01 (ఓసీ) (మల్టీ జోన్​ -1)
  • ఈఎస్​ఐ డిస్పెన్సరీ, శివాజీనగర్​ (నిజామాబాద్​)​ – 01 (ఓసీ) (మల్టీ జోన్​ -1)

ఫార్మాసిస్ట్​ (Pharmacist)

  • మొత్తం పోస్టులు : మూడు (03)
  • ఈఎస్​ఐ డిస్పెన్సరీ, నిర్మల్​ – 01 (ఓసీ) (జోన్​ -2)
  • ఈఎస్​ఐ డిస్పెన్సరీ, శివాజీనగర్​ (నిజామాబాద్​)​ – 01 (ఓసీ మహిళ) (జోన్​ -2)
  • ఈఎస్​ఐ డయాగ్నస్టిక్​ సెంటర్​ నిజామాబాద్​ – 01 (ఎస్సీ మహిళ) (జోన్​ -2)

ల్యాబ్​ టెక్నీషియన్ (Lab Technician)

  • మొత్తం పోస్టులు : రెండు (02)
  • ఈఎస్​ఐ డిస్పెన్సరీ, నిజామాబాద్​ – 01 (ఓసీ మహిళ (జోన్​ -2)
  • ఈఎస్​ఐ డయాగ్నస్టిక్​ సెంటర్​ నిజామాబాద్​ – 01 (ఎస్సీ మహిళ) (జోన్​ -2)

Qualifications

Civil Assistant Surgeon :
(i) Must possess M.B.B.S. Degree or an equivalent qualification as entered in the schedule to the Medical Council Act, 1956 as subsequently amended.
(ii) Must be permanent registered medical practitioner within the meaning of law for the time being existing in the state.

Pharmacist :
Must possess a diploma in Pharmacy or its equivalent qualification from a recognized institution.

Lab Technician :
1. Must have passed 10th class examination or its equivalent examination.
2. Must possess a certificate of laboratory technician from any recognized institution.

Salary

సివిల్ అసిస్టెంట్ సర్జన్​ : రూ.58,850 (నెలకు)
ఫార్మసిస్ట్ : రూ.31,040
ల్యాబ్​ టెక్నీషియన్ : రూ.31,040

Age Limit

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. మాజీ సైనికులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.

Selection Procedure

జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించే జిల్లా స్థాయి ఎంపిక కమిటీ.. అభ్యర్థుల విద్యార్హతల్లో మెరిట్​ను పరిశీలించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. ప్రస్తుత రూల్​ ఆఫ్​ రిజర్వేషన్​ ప్రకారం ఎంపిక చేస్తారు.

How to Apply

ఈ పోస్టులకు ఆఫ్​లైన్​ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తికలిగిన అభ్యర్థులు నిర్మల్​, నిజామాబాద్​ జిల్లాల అధికారిక వెబ్​సైట్ల​ (https://nirmal.telangana.gov.in, https://nizamabad.telangana.gov.in) లో పొందుపరిచిన అప్లికేషన్​ ఫాంలను డౌన్​లోడ్​ చేసుకోవాలి. మూడు పోస్టులకు (సివిల్ అసిస్టెంట్ సర్జన్,​  ఫార్మసిస్ట్, ల్యాబ్​ టెక్నీషియన్) సంబంధించిన అప్లికేషన్​ ఫాంలు వేర్వేరుగా ఉంటాయి.  వాటిని డౌన్​లోడ్​ చేసుకొని అందులో రీసెంట్​ పాస్​పోర్ట్​ సైజ్​ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. దానికి విద్యార్హతలతో పాటు ఇతర అన్ని సర్టిఫికెట్లు సెల్ఫ్​ అటెస్ట్​ చేసి జత చేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను సెప్టెంబర్​ 25వ తేదీన సాయంత్ర 5 గంటల లోపు ఈ కింది చిరునామాలో స్వయంగా వెళ్లి అందజేయవచ్చు. లేదా రిజిస్టర్​ పోస్టు చేయవచ్చు.
The Joint Director,
Insurance Medical Services,
ESI Hospital Campus, Narsampet Road,
Labor Colony, Warangal, Pin.No.506013

Required Certificates

ఈ కింది సర్టిఫికెట్లు అప్లికేషన్​ ఫాంకు జతచేయాలి.
1. ఎస్సెస్సీ మెమో
2. ఇంటర్మీడియెట్​ మెమో
3. విద్యార్హతల సర్టిఫికెట్లు
4. రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్లు
5. ఇటీవల తీసుకున్న కులం సర్టిఫికెట్​
6. ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
7. ప్రైవేటులో చదివినవారు రెసిడెన్స్​ సర్టిఫికెట్​
8. వైకల్య సర్టిఫికెట్​ (దివ్యాంగులు)
9. రీసెంట్​ పాస్​ పోర్ట్​ సైజ్​ ఫొటో
10. ప్రొవిజినల్​ సర్టిఫికెట్లు

దరఖాస్తులకు చివరి తేదీ : 25.09.2023 (సాయంత్రం 5 గంటల వరకు)

Important Points

  • ఈ పోస్టులు తాత్కాలికమైనవి.
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పాటు పనిచేయాల్సి ఉంటుంది.

– Jobs in ESI Dispensaries