Admissions in Allied Health SciencesA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Admissions in Allied Health Sciences : హైదరాబాద్​లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Nizam’s Institute of Medical Sciences-NIMS) 2023 విద్యా సంవత్సరానికి నాలుగు సంవత్సరాల బ్యాచిలర్​ ఆఫ్​ సైన్స్​ డిగ్రీ కోర్స్​ అలైడ్ హెల్త్​ సైన్సెస్ లో (Bachelor of Science Degree Course in Allied Health Sciences)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కోర్సులో మొత్తం 11 విభాగాలలో 100 సీట్లు ఉంటాయి. టీఎస్ ఎంసెట్​‌‌-2023లో సాధించిన ర్యాంకు ఆధారంగా అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Courses & Number of seats

1. బీ.ఎస్సీ (అనస్థీషియా టెక్నాలజీ) B.Sc. (Anesthesia Technology) – 10
2. బీ.ఎస్సీ (డయాలసిస్ థెరపీ టెక్నాలజీ) B.Sc. (Dialysis Therapy Technology) – 20
3. బీ.ఎస్సీ (కార్డియోవాస్కులర్ టెక్నాలజీ) B.Sc. (Cardiovascular Technology) – 12
4. బీ.ఎస్సీ (ఎమర్జెన్సీ & ట్రామా కేర్ టెక్నాలజీ) B.Sc. (Emergency & Trauma Care Technology) – 08
5. బీ.ఎస్సీ (రేడియోగ్రఫీ & ఇమేజింగ్ టెక్నాలజీ) B.Sc. (Radiography & Imaging Technology) – 10
6. బీ.ఎస్సీ (మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ) B.Sc. (Medical Laboratory Technology) – 12
7. బీ.ఎస్సీ (న్యూరో టెక్నాలజీ) B.Sc. (Neuro Technology) – 06
8. బీ.ఎస్సీ (పెర్ఫ్యూజన్ టెక్నాలజీ) B.Sc. (Perfusion Technology) – 04
9. బీ.ఎస్సీ (రేడియేషన్ థెరపీ టెక్నాలజీ) B.Sc. (Radiation Therapy Technology) – 04
10. బీ.ఎస్సీ (రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ) B.Sc. (Respiratory Therapy Technology) – 10
11. బీ.ఎస్సీ (ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్B.Sc. (Transfusion Medicine) – 04

Qualification

బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) పాసైన వారు అర్హులు.
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడిట్ ఎడ్యుకేషన్ తో పాటు CBSE/ ICSE/ TOSS తదితర గుర్తింపు పొందిన బోర్డులలో ఇంటర్మీడియట్ చేసిన వారు కూడా అర్హులే.
ఈ కోర్సు వ్యవధి మొత్తం నాలుగు సంవత్సరాలు ఉంటుంది.
టీఎస్ ఎంసెట్​‌‌-2023 రాసి ఉండాలి.
ఈ కోర్సులో ఒక సంవత్సరం ఇంటర్న్ షిప్ ఉంటుంది.
నిమ్స్ నిబంధనల మేరకు ఇంటర్న్ షిప్ సమయంలో స్టైపెండ్ కూడా ఇస్తారు.

Age Limit

ఈ కోర్సులో చేరే అభ్యర్థుల వయసు డిసెంబర్ 31, 2023 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.

How to Apply

ఈ కోర్సుకు అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు NIMS వెబ్ సైట్ (www.nims.edu.in)ను ఓపెన్ చేయాలి.
అందులో Apply Online పై క్లిక్​ చేయాలి.
దాంట్లో Register Yourself పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్టర్ చేసుకొన్న తర్వాత అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తాయి.
వాటితో లాగిన్ అయి ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
అందులో అడిగే అన్ని సర్టిఫికెట్లు అప్​లోడ్​ చేయాలి.

Registration and Processing fee

ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థులు రిజిస్ట్రేషన్​ అండ్​ ప్రాసెసింగ్​ ఫీజు చెల్లించాలి.
ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,000 చెల్లించాలి.
క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఫీజు చెల్లించవచ్చు.

Documents to be Submitted

ఆన్ లైన్ అప్లికేషన్ ను విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ఆ అప్లికేషన్ కు ఈ క్రింది సర్టిఫికెట్లు జతచేయాలి.
1. పదో తరగతి మార్క్స్ మెమో
2. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
3. ఇంటర్మీడియట్ ట్రాన్స్ ఫర్ (టీసీ)/మైగ్రేషన్ సర్టిఫికెట్
4. స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికెట్స్ (6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు)
5. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఇన్ సర్వీస్ అభ్యర్థులు)
6. వైకల్య సర్టిఫికెట్ (దివ్యాంగులు)
7. టీఎస్​ ఎంసెట్​-2023 ర్యాంక్​ కార్డ్​
8. సోషల్ స్టాటస్ సర్టిఫికెట్ (బీసీ (ఈ) అభ్యర్థులు)
పై అన్ని సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేయాలి.
ఆ తర్వాత వాటన్నింటినీ అప్లికేషన్ కు జతచేయాలి.
ఆ మొత్తం సర్టిఫికెట్లను జులై 03, 2023 సాయంత్రం 5 గంటల లోపు ఈ కింది చిరునామాకు వ్యక్తిగతంగా గానీ లేదా రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
The Associate Dean,
Academic-2, 2nd floor, Old OPD Block,
Nizam’s Institute of Medical Sciences,
Hyderabad – 500 082
అప్లికేషన్ అందిన తర్వాత ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
ఒకవేళ అప్లికేషన్ అందినట్టు సమాచారం రాకుంటే వారం రోజుల్లో నిమ్స్ లోని Academic-2, 2nd floor, Old OPD block కార్యాలయంలో సంప్రదించాలి.
లేదా, [email protected] ఈ-మెయిల్ కు లేదా 040-23489189 నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
ఈ అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం నిమ్స్ లోని నోటీస్ బోర్డు అలాగే, వెబ్ సైట్ లో ఉంచుతారు.
వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఇవ్వరు అభ్యర్థులు తరచూ వెబ్ సైట్ ను చూస్తుండాలి.

Course Fee

అడ్మిషన్ ఫీజు – రూ.3,000 (One Time) (Non Refundable)
సెక్యూరిటీ డిపాజిట్ – రూ.1,000 (One Time) (Refundable)
ట్యూషన్ ఫీజు – ఏడాదికి రూ.39,750 చొప్పున మూడు సంవత్సరాలు.
లైబ్రరీ ఫీజు – ఏడాదికి రూ.1,000 చొప్పున మూడు సంవత్సరాలు.
పరీక్ష ఫీజు – ఏడాదికి రూ.1,500 చొప్పున మూడు సంవత్సరాలు.

Importanat Dates

ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూన్​ 28, 2023
అప్లికేషన్ హార్డ్ కాపీ పంపేందుకు చివరి తేదీ: జులై 3, 2023
ప్రొవిజినల్​ మెరిట్ ​లిస్ట్​ డిస్​ప్లే (వెబ్​సైట్​) : ఆగస్టు 18, 2023
ఫైనల్​​ మెరిట్​ లిస్ట్​ డిస్​ప్లే (వెబ్​సైట్​) : ఆగస్టు 23, 2023
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ క్యాండిడేట్స్​​ లిస్ట్​ డిస్​ప్లే : ఆగస్టు 23, 2023
కౌన్సెలింగ్​ లెటర్స్​ ఇష్యూ (త్రూ లాగిన్​) : ఆగస్టు 28, 2023
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ : సెప్టెంబర్​ 02, 2023 శనివారం

– Admissions in Allied Health Sciences