Staff Nurse Exam DateA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Staff Nurse Exam Date : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన స్టాఫ్‌ నర్స్ (Staff Nurse) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ఆగస్ట్‌ 2వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (Medical Health Services Recruitment Board-MHSRB) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు  నోటిఫికేషన్ జారీ (Notification No.3/2022) చేసింది. ఈ పోస్టులకు మొత్తం 40,926 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Computer Based Test (CBT)

ఈసారి స్టాఫ్​నర్స్​ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్‌డ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్టు బోర్డు ప్రకటించింది.  అయితే, 40,926 మందికి ఒకేసారి ఎగ్జామ్‌ నిర్వహించడం సాధ్యం కాబట్టి మూడు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. ఆగస్ట్ 2వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 10:20 వరకు ఫస్ట్ షిప్ట్, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 1:50 వరకు రెండో షిఫ్ట్, సాయంత్రం 4 గంటల నుంచి 5:20 వరకు మూడో షిఫ్ట్‌ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.

Hall Tickets from 23rd July

  • ఈ పరీక్ష 80 నిమిషాల పాటు ఉంటుందని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.
  • మొత్తం  80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్‌ ఉంటాయని, ప్రతి జవాబుకు ఒక మార్కు ఉంటుందని తెలిపింది.
  • ప్రశ్నపత్రం ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుందని పేర్కొంది.
  • బోర్డు వెబ్‌సైట్​ నుంచి జులై 23 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది.

Examination Centres

ఈ పరీక్షకు రాష్ట్రంలో కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు బోర్డు తెలిపింది. హైదరాబాద్​, వరంగల్​, ఖమ్మం, నిజామాబాద్​ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.

Selection Procedure

  • ఈసారి అభ్యర్థుల ఎంపికలో నార్మలైజేషన్‌ ప్రాసెస్​ను బోర్డు ప్రకటించింది.
  • మొత్తం 100 పాయింట్ల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
  • అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్ఠంగా 80 మార్కులు కేటాయిస్తారు.
  • రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఆసుపత్రులు, వివిధ కార్యక్రమాలలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన వారికి గరిష్ఠంగా 20 మార్కులు కేటాయిస్తారు.
  • గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, గిరిజనేతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 3 పాయింట్లు కేటాయిస్తారు.
  • కనీసం 6 నెలలు పనిచేస్తేనే ఈ మార్కులు కేటాయిస్తారు.
  • అయితే, ఈ మార్కులకు సంబంధించి సంబంధిత విభాగం హెచ్​వోడీ నుంచి సర్టిఫికెట్ తీసుకొని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

Syllabus for Staff Nurse Written Test

– Staff Nurse Exam Date