Admissions in BPT NIMSA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Admissions in BPT NIMS : హైదరాబాద్​లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) (Nizam’s Institute of Medical Sciences-NIMS) 2023 విద్యాసంవత్సరానికి గాను నాలుగున్నర సంవత్సరాల (ఇంటర్న్​షిప్​తో కలిపి) బ్యాచిలర్​ ఆఫ్​ ఫిజియోథెరపీ (బీపీటీ​) (Bachelor of Physiotherapy (BPT)) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 50 సీట్లు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Eligibilty

  • బోటనీ, జువాలజీ, ఫిజిక్స్​, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా బయోలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ బ్రిడ్జ్ కోర్సుతో ఒకేషనల్ ఫిజియోథెరపీ చేసి ఉండాలి.
  • టీఎస్ ఎంసెట్​‌‌-2023 రాసి ఉండాలి.

Age Limit

ఈ కోర్సులో అడ్మిషన్​కు అభ్యర్థుల వయసు డిసెంబర్ 31, 2023 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే, డిసెంబర్ 31, 2023 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాల సడలింపు ఉంటుంది.

Selection Procedure

  • టీఎస్​ ఎంసెట్-2023లో సాధించిన ర్యాంకు ఆధారంగా ఈ కోర్సులో అడ్మిషన్లు కల్పిస్తారు.
  • అలాగే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న రూల్​ ఆఫ్​ రిజర్వేషన్లను పాటిస్తారు.
  • తెలంగాణ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, నాన్​ లోకల్​ అభ్యర్థులకు 15 శాతం సీట్లు కేటాయిస్తారు.
  • 15 శాతం రిజర్వేషన్లలోనూ తెలంగాణ జనరల్​ అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.

How to Apply

ఈ కోర్సుకు అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు NIMS వెబ్ సైట్ (www.nims.edu.in)ను ఓపెన్ చేయాలి.
అందులో Apply Online పై క్లిక్​ చేయాలి.
దాంట్లో Register Yourself పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్టర్ చేసుకొన్న తర్వాత అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తాయి.
వాటితో లాగిన్ అయి ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
అందులో అడిగే అన్ని సర్టిఫికెట్లు అప్​లోడ్​ చేయాలి.

Registration and Processing fee

ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థులు రిజిస్ట్రేషన్​ అండ్​ ప్రాసెసింగ్​ ఫీజు చెల్లించాలి.
ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,000 చెల్లించాలి.
క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఫీజు చెల్లించవచ్చు.

Documents to be Submitted

ఆన్ లైన్ అప్లికేషన్ ను విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ఆ అప్లికేషన్ కు ఈ క్రింది సర్టిఫికెట్లు జతచేయాలి.
1. టీఎస్​ ఎంసెట్​‌‌-2023 ర్యాంక్​ కార్డు
2. పదో తరగతి మార్క్స్ మెమో
3. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
4. ఇంటర్మీడియట్ ట్రాన్స్ ఫర్ (టీసీ)/మైగ్రేషన్ సర్టిఫికెట్
5. బోనఫైడ్​ అండ్ కండక్ట్ సర్టిఫికెట్స్ (6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు)
6. సోషల్ స్టాటస్ సర్టిఫికెట్ (బీసీ (ఈ) అభ్యర్థులు)
7. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఇన్ సర్వీస్ అభ్యర్థులు)
8. వైకల్య సర్టిఫికెట్ (దివ్యాంగులు)
పై అన్ని సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేయాలి.
ఆ తర్వాత వాటన్నింటినీ అప్లికేషన్ కు జతచేయాలి.
ఆ మొత్తం సర్టిఫికెట్లను జులై 03, 2023 సాయంత్రం 5 గంటల లోపు ఈ కింది చిరునామాకు వ్యక్తిగతంగా గానీ లేదా రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
The Associate Dean,
Academic-2, 2nd floor, Old OPD Block,
Nizam’s Institute of Medical Sciences,
Hyderabad – 500 082
అప్లికేషన్ అందిన తర్వాత ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
ఒకవేళ అప్లికేషన్ అందినట్టు సమాచారం రాకుంటే వారం రోజుల్లో నిమ్స్ లోని Academic-2, 2nd floor, Old OPD block కార్యాలయంలో సంప్రదించాలి.
లేదా, [email protected] ఈ-మెయిల్ కు లేదా 040-23489189 నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
ఈ అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం నిమ్స్ లోని నోటీస్ బోర్డు అలాగే, వెబ్ సైట్ లో ఉంచుతారు.
వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఇవ్వరు అభ్యర్థులు తరచూ వెబ్ సైట్ ను చూస్తుండాలి.

Course Fee

అడ్మిషన్ ఫీజు – రూ.3,000 (One Time) (Non Refundable)
సెక్యూరిటీ డిపాజిట్ – రూ.1,000 (One Time) (Refundable)
ట్యూషన్ ఫీజు – ఏడాదికి రూ.39,750 చొప్పున నాలుగు సంవత్సరాలు.
లైబ్రరీ ఫీజు – ఏడాదికి రూ.1,000 చొప్పున నాలుగు సంవత్సరాలు.
పరీక్ష ఫీజు – ఏడాదికి రూ.1,500 చొప్పున నాలుగు సంవత్సరాలు చెల్లించాలి.

Importanat Dates

ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూన్​ 28, 2023
అప్లికేషన్ హార్డ్ కాపీ పంపేందుకు చివరి తేదీ: జులై 3, 2023
ప్రొవిజినల్​ మెరిట్ ​లిస్ట్​ డిస్​ప్లే (వెబ్​సైట్​) : ఆగస్టు 04, 2023
ఫైనల్​​ మెరిట్​ లిస్ట్​ డిస్​ప్లే (వెబ్​సైట్​) : ఆగస్టు 09, 2023
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ క్యాండిడేట్స్​​ లిస్ట్​ డిస్​ప్లే : ఆగస్టు 09, 2023
కౌన్సెలింగ్​ లెటర్స్​ ఇష్యూ (త్రూ లాగిన్​) : ఆగస్టు 12, 2023
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ : ఆగస్టు 19, 2023 (శనివారం)

– Admissions in BPT NIMS