Development Assistant Jobs in NABARDA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Development Assistant Jobs in NABARD : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (National Bank For Agriculture and Rural Development-NABARD) దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో డెవలప్మెంట్ అసిస్టెంట్ (Development Assistant) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 177 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇవి గ్రూప్-బీ పోస్టులు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Details of Posts

1. Development Assistant
2. Development Assistant (Hindi)

Number of Vacancies

Development Assistant – Total – 173 (UR- 80, SC-21, ST-11, OBC-46, EWS-15)
Development Assistant (Hindi) – Total – 04 (UR-03, ST-01)

Age Limit

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు సెప్టెంబర్ 01, 2022 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

Pay Scale

Rs.13150-750(3) – 15400 – 900(4) – 19000 1200 (6) – 26200 1300 (2) – 28800 – 1480 (3) 33240 – 1750 (1) – 34990 (20 years). ప్రారంభంలో నెలకు రూ.32,000 జీతం పొందవచ్చు.

Qualifications

డెవలప్మెంట్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసినవారు అర్హులు. 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు, మాజీ సైనికులు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది.

డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ): గుర్తింపు పొందిన యూనివర్సిటీలో హిందీ మరియు ఇంగ్లిష్ తప్పనిసరి లేదా అప్షనల్ సబ్జెక్టుగా ఇంగ్లిష్ లేదా హిందీ మీడియంలో బ్యాచిలర్ డిగ్రీ చేసినవారు అర్హులు. 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు, మాజీ
సైనికులు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. లేదా హిందీ మరియు ఇంగ్లిష్ మెయిన్ సబ్జెక్టులుగా 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు కావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు, మాజీ సైనికులు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది.

How to Apply

  • ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) కు చెందిన వెబ్ సైట్ (https://www.nabard.org) లోకి లాగిన్ అయ్యి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 15, 2022 నుంచి ప్రారంభం అవుతుంది.
  • అక్టోబర్ 10, 2022 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అదే విధంగా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ ను సెప్టెంబర్ 15న వెబ్ సైట్ లో ఉంచుతారు.
  •  అందులో రాష్ట్రం, కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హతలు, అప్లికేషన్ ఫీజు, ఎంపిక విధానం,దరఖాస్తు చేసుకొనేందుకు ఆన్ లైన్ లింకు అందుబాటులో ఉంటాయి.
  • వాటిని క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు.

Website – https://www.nabard.org

– Development Assistant Jobs in NABARD