IT Professionals Jobs in BOB

IT Professionals Jobs in BOB : బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda-BOB) ఒప్పంద ప్రాతిపదికన (Contractual Basis) పద్నాలుగు (14) ఐటీ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఐదు (05) సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల పనితీరును బట్టి పొడిగించవచ్చు. అభ్యర్థుల అర్హతలు, అనుభవం ఆధారంగా జీతం చెల్లిస్తారు.

Details of Posts

1. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ – డాటా సైంటిస్ట్
2. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ – డాటా సైంటిస్ట్
3. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ డాటా ఇంజినీర్
4. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ డాటా ఇంజినీర్

Reservation Wise Vacancies

డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ – డాటా సైంటిస్ట్ & డాటా ఇంజినీర్ – ఓబీసీ (OBC (Non Creamy Layer))-01 , అన్ రిజర్వుడ్ (Unreserved)-03
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ – డాటా సైంటిస్ట్ & డాటా ఇంజినీర్ – ఎస్సీ (Scheduled Caste) – 01, (OBC (Non Creamy Layer))-02, ఈడబ్ల్యూఎస్ (Economically Weaker Sections)-01, అన్ రిజర్వుడ్ (Unreserved)-06

Age Limit

డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ – డాటా సైంటిస్ట్ & డాటా ఇంజినీర్ పోస్టులకు అభ్యర్థుల వయసు జూన్ 1, 2022 నాటికి 28 సంవత్సరాల నుంచి 35
సంవత్సరాల మధ్య ఉండాలి. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ – డాటా సైంటిస్ట్ & డాటా ఇంజినీర్ పోస్టులకు 25 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల
మధ్య ఉండాలి. ఎస్సీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీ(నాన్ క్రిమీలేయర్) అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాల సడలింపు ఉంది.

Qualifications & Experience

డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్-డాటా సైంటిస్ట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ – డాటా సైంటిస్ట్ పోస్టులకు అభ్యర్థులు ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీ.టెక్/బీ.ఈ/ఎం.టెక్/ఎం.ఈ (కంప్యూటర్ నైన్స్)/ఐటీ/డాటా సైన్స్/మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ పూర్తి చేసి ఉండాలి. బీ.టెక్/బీ.ఈలో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.
అలాగే, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ – డాటా సైంటిస్ట్ అభ్యర్థులకు బీఎఫ్ఎస్ఐ సెక్టార్ లో ఐటీ/ డాటా సైన్స్ లో కనీసం ఆరు (06) సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం, డాటా సైంటిస్ట్ గా కనీసం మూడు (03) సంవత్సరాల అనుభవం తప్పనిసరి. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్-డాటా సైంటిస్ట్ అభ్యర్థులకు బీఎఫ్ఎస్ఐ సెక్టార్ లో ఐటీ/ డాటా సైన్స్ లో కనీసం మూడు (03) సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం, డాటా నైంటిస్ట్ గా కనీసం ఒక (01) సంవత్సరం అనుభవం ఉండాలి.
డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్-డాటా ఇంజినీర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ – డాటా ఇంజినీర్ పోస్టులకు అభ్యర్థులు ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. క్లౌడెరా సర్టిఫైడ్ అడ్మినిస్ట్రేటర్ పాసైన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్-డాటా ఇంజినీర్ అభ్యర్థులు బీఎఫ్ఎస్ఐ సెక్టార్ లో ఐటీలో కనీసం ఆరు (06) సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్
అనుభవం, బిగ్ డాటా టెక్నాలజీలో కనీసం మూడు (03) సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్-డాటా ఇంజినీర్
అభ్యర్థులు బీఎఫ్ఎస్ఐ సెక్టార్ లో ఐటీలో కనీసం మూడు (03) సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం, బిగ్ డాటా టెక్నాలజీ కనీసం ఒక (01)
సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.

How to Apply

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా BOB వెబ్ సైట్ (www.bankofbaroda.in/Career.htm) లోకి లాగిన్ అయ్యి ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థులు ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ను మాత్రమే ఇవ్వాలి. కాల్ లెటర్/ఇంటర్వ్యూ తేదీలు ఇతర సమాచారం అంతా కూడా ఆన్ లైన్ అప్లికేషన్ ఫాంలో ఇచ్చిన ఈ-మెయిల్ కు మాత్రమే పంపిస్తారు.
ఆ తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్, సమాచార చార్జీల నిమిత్తం రూ.600 చెల్లించాలి. జీఎస్టీ, ట్రాంజాక్షన్ చార్జీలు అదనం. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో ఫీజు చెల్లించవచ్చు. అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫాంతో పాటు విద్యార్హతలు, అనుభవం తదితర సర్టిఫికెట్లు, రీసెంట్ పాస్ పోర్ట్ నైజ్ ఫొటో, సంతకం నోటిఫికేషన్ లో సూచించిన విధంగా అప్ లోడ్ చేయాలి.

ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాల కోసం అభ్యర్థులు బ్యాంకు వెబ్ సైట్ (www.bankofbaroda.in/careers.htm) (Current Opportunities) ను తరచూ చూస్తుండాలి.

ఆన్ లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 07 జూలై, 2022

– IT Professionals Jobs in BOB