Jobs in BOB on Regular basis

Jobs in BOB on Regular basis : బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda-BOB) రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కార్పొరేట్ అండ్ ఇనిస్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాల్లో మొత్తం 325 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

Details of Posts

1. రిలేషన్ షిప్ మేనేజర్ (సీనియర్ మేనేజర్ గ్రేడ్/స్కేల్-IV(SMG/S-IV))
2. కార్పొరేట్ అండ్ ఇనిస్టిట్యూషనల్ క్రెడిట్ (మిడిల్ మేనేజర్ గ్రేడ్/స్కేల్-III(SMG/S-III))
3. క్రెడిట్ అనలిస్ట్ (మిడిల్ మేనేజర్ గ్రేడ్/స్కేల్-III(SMG/S-III))
4. కార్పొరేట్ అండ్ ఇనిస్టిట్యూషనల్ క్రెడిట్ (మిడిల్ మేనేజర్ గ్రేడ్/ స్కేల్-II(SMG/S-II))

Reservation Wise Vacancies

1.SMG/S-IV: ఎస్సీ-11, ఎస్టీ-5, ఓబీసీ -20, ఈడబ్ల్యూఎస్-7, అన్ రిజర్వుడ్-32. ఇందులోనే ఓసీ-1, VI-1, HI-1.
2.MMG/S-III: ఎస్సీ-30, ఎస్టీ-14, ఓబీసీ-54, ఈడబ్ల్యూఎస్-20, అన్ రిజర్వుడ్-82. ఇందులోనే ఓసీ-2, VI-2, HI-2, ID-2.
3.MMG/S-II: ఎస్సీ-7, ఎస్టీ-3, ఓబీసీ-13, ఈడబ్ల్యూఎస్-5, అన్ రిజర్వుడ్-22. ఇందులోనే VI-1, HI-1.

Corporate & Inst. Credit (MMG/S-III)

పోస్టు పేరు: కార్పొరేట్ అండ్ ఇనిస్టిట్యూషనల్ క్రెడిట్
పోస్టుల సంఖ్య: వంద (100)
వయసు: 28 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మరియు ఫైనాన్స్లో స్పెషలైజేషన్ తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/డిప్లొమా. కనీసం ఒక సంవత్సరం కోర్సు చేసి ఉండాలి. సీఏ/ సీఎఫ్ఎ /సీఎస్/ సీఎంఏ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. అదే విధంగా కార్పొరేట్ క్రెడిట్ లో సేల్స్ లేదా రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ లో అవగాహన ఉండి పబ్లిక్/ప్రైవేట్/ విదేశీ బ్యాంకులు/ఆర్థిక సంస్థలలో కనీసం ఐదు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
జీతం: రూ.63840 x 1990 (5)-73790 x 2220 (2)-78230

Corporate & Inst. Credit (MMG/S-III)

పోస్టు పేరు: కార్పొరేట్ అండ్ ఇనిస్టిట్యూషనల్ క్రెడిట్
పోస్టుల సంఖ్య: వంద (100)
వయసు: 28 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మరియు ఫైనాన్స్లో స్పెషలైజేషన్ తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/డిప్లొమా. కనీసం ఒక సంవత్సరం కోర్సు చేసి ఉండాలి. సీఏ/ సీఎఫ్ఎ /సీఎస్/ సీఎంఏ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. అదే విధంగా కార్పొరేట్ క్రెడిట్ లో సేల్స్ లేదా రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ లో అవగాహన ఉండి పబ్లిక్/ప్రైవేట్/ విదేశీ బ్యాంకులు/ఆర్థిక సంస్థలలో కనీసం ఐదు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
జీతం: రూ.63840 x 1990 (5)-73790 x 2220 (2)-78230

Credit Analyst (MMG/S-III)

పోస్టు పేరు: క్రెడిట్ అనలిస్ట్
పోస్టుల సంఖ్య: వంద (100)
వయసు: 28 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మరియు ఫైనాన్స్లో స్పెషలైజేషన్ తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి. సీఏ/ సీఎంఏ/ సీఎస్/సీఎఫ్ఎ చేసిన వారు కూడా అర్హులే. అలాగే, క్రెడిట్ అప్రైజల్/ప్రాసెసింగ్ ఆపరేషన్స్ పై అవగాహన ఉండి పబ్లిక్/ప్రైవేట్/విదేశీ బ్యాంకులు/ఆర్థిక సంస్థలలో భారీ లేదా మధ్య తరహా కార్పొరేట్ క్రెడిట్ లో నాలుగు సంవత్సరాలు, బ్యాంకులో ఐదు సంవత్సరాలు పనిచేసి ఉండాలి.
జీతం: రూ.63840 x 1990 (5)- 73790 x 2220 (2) 78230

Corporate & Inst. Credit (MMG/S-II)

పోస్టు పేరు: క్రెడిట్ అనలిస్ట్
పోస్టుల సంఖ్య యాబై (50)
వయసు: 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మరియు సీఏ చేసి ఉండాలి. క్రెడిట్ అప్రైజల్/ప్రాసెసింగ్/ఆపరేషన్స్ లో అవగాహన ఉండి పబ్లిక్/ప్రైవేట్/విదేశీ బ్యాంకులలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. జీతం: రూ. 48170 x 1740(1)-49910 x 1990 (10)-69180

పైన సూచించిన వయసు కేవలం అన్ రిజర్వుడ్ అభ్యర్థులకు మాత్రమే. ఎఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు మూడు సంవత్సరాల సడలింపు ఉంటుంది. అలాగే, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు పదిహేను సంవత్సరాలు, ఓబీసీలకు పదమూడు సంవత్సరాలు, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పది సంవత్సరాల సడలింపు ఉంటుంది. అదే విధంగా ఎక్స్ సర్వీస్ మెన్, 1984 అల్లర్ల బాధిత ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పది సంవత్సరాలు, ఓబీసీలకు ఎనిమిది సంవత్సరాలు, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది.

Online Test

అన్ లైన్ టెస్ట్ 225 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో నాలుగు సెక్షన్ లు ఉంటాయి. మొదటి సెక్షన్ లో రీజినింగ్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో జవాబుకు ఒక మార్కు ఉంటుంది. రెండో సెక్షన్ లో ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో జవాబుకు ఒక మార్కు ఉంటుంది. మూడో సెక్షన్ లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో జవాబుకు ఒక మార్కు ఉంటుంది. నాలుగో సెక్షన్ లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 75 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో జవాబుకు రెండు మార్కులు ఉంటాయి. ప్రశ్న పత్రం ఇంగ్లిష్ మరియు హిందీ భాషలో ఉంటుంది. క్వాలిఫై కావడానికి జనరల్ అభ్యర్థులు ప్రతి సెక్షన్ లో 40 శాతం మార్కులు సాధించాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించినా సరిపోతుంది.

How to Apply

  • ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా BOB వెబ్ సైట్ (www.bankofbaroda.in/Career.htm) లోకి లాగిన్ అయ్యి ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థులు ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ను మాత్రమే ఇవ్వాలి. కాల్ లెటర్/ఇంటర్వ్యూ తేదీలు ఇతర సమాచారం అంతా కూడా ఆన్ లైన్ అప్లికేషన్ ఫాంలో ఇచ్చిన ఈ-మెయిల్ కు మాత్రమే పంపిస్తారు.
  • ఆ తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్, సమాచార చార్జీల నిమిత్తం రూ.600 చెల్లించాలి. జీఎస్టీ, ట్రాంజాక్షన్ చార్జీలు అదనం. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో ఫీజు చెల్లించవచ్చు. అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ ఫాంతో పాటు విద్యార్హతలు, అనుభవం తదితర సర్టిఫికెట్లు, రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం నోటిఫికేషన్ లో సూచించిన విధంగా అప్ లోడ్ చేయాలి. ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాల కోసం అభ్యర్థులు బ్యాంకు వెబ్ సైట్ (www.bankofbaroda.in/careers.htm) (Current Opportunities) ను తరచూ చూస్తుండాలి.

ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు చెలింపునకు చివరి తేదీ: 12 జూలై, 2022.
– Jobs in BOB on Regular basis