Jobs in Sangareddy ESI Hospitals : తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలలో సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 16 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Vacancies
01. సివిల్ అసిస్టెంట్ సర్జన్ (Civil Assistant Surgeon) – 08
02. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (Dental Assistant Surgeon) – 01
03. ఫార్మాసిస్ట్ (Pharmacist) – 07
Qualifications
Civil Assistant Surgeon :
(i) Must possess M.B.B.S. Degree or an equivalent qualification as entered in the schedule to the Medical Council Act, 1956 as subsequently amended.
(ii) Must be permanent registered medical practitioner within the meaning of law for the time being existing in the state.
Dental Assistant Surgeon :
Must possess a degree in Dental Surgery (viz.) B.D.S of a university in India established or incorporated by or under Central Actor a State Act or a Provincial Act or an Institution recognized by the University Grants Commission or any other Equivalent qualification Indian or Foreign recognized as equivalent thereto by the Dental Council of India
Pharmacist :
Must possess a diploma in Pharmacy or its equivalent
qualification from a recognized institution.
Salary
సివిల్ అసిస్టెంట్ సర్జన్ : రూ.58,850
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ : రూ.58,850
ఫార్మసిస్ట్ : రూ.31,040
Age Limit
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. మాజీ సైనికులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
Selection Procedure
జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించే జిల్లా స్థాయి ఎంపిక కమిటీ అభ్యర్థుల విద్యార్హతల్లో మెరిట్‌ను పరిశీలించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. ప్రస్తుత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేస్తారు.
How to Apply
ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తికలిగిన అభ్యర్థులు సంగారెడ్డి జిల్లా అధికారిక వెబ్సైట్ (https://sangareddy.telangana.gov.in ) లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంలను డౌన్లోడ్ చేసుకోవాలి. మూడు పోస్టులకు (సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ఫార్మసిస్ట్) సంబంధించిన అప్లికేషన్ ఫాంలు వేర్వేరుగా ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని అందులో రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. దానికి విద్యార్హతలతో పాటు ఇతర అన్ని సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేసి జత చేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను ఏప్రిల్ 13వ తేదీన సాయంత్ర 5 గంటల లోపు జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, 5వ అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్ సనత్‌నగర్, నాచారం, హైదరాబాద్- 500076 చిరునామాలో అందజేయాలి. నేరుగా వెళ్లి అందజేయవచ్చు. లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించవచ్చు.
Required Certificates
ఈ కింది సర్టిఫికెట్లు అప్లికేషన్ ఫాంకు జతచేయాలి.
1. ఎస్సెస్సీ మెమో
2. ఇంటర్మీడియెట్ మెమో
3. విద్యార్హతల సర్టిఫికెట్లు
4. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు
5. ఇటీవల తీసుకున్న కులం సర్టిఫికెట్
6. ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
7. ప్రైవేటులో చదివినవారు రెసిడెన్స్ సర్టిఫికెట్
8. వైకల్య సర్టిఫికెట్ (దివ్యాంగులు)
9. రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
10. ప్రొవిజినల్ సర్టిఫికెట్లు
దరఖాస్తులకు చివరి తేదీ : 13.04.2023 (సాయంత్రం 5 గంటల వరకు)
దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా :
The Joint Director (Medical),
Insurance Medical Services, Hyderabad,
5th floor, Hostel Building, ESI Hospital,
Sanathnagar, Nacharam, Hyderabad- 500076.
Important Points
- ఈ పోస్టులు తాత్కాలికమైనవి.
- కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పాటు పనిచేయాల్సి ఉంటుంది.
- సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు Multi Zone-II కు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- ఫార్మసిస్ట్ పోస్టులకు Zone-VIకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
– Jobs in Sangareddy ESI Hospitals