Jobs in SBIA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Jobs in SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India-SBI) రెగ్యులర్ బేసిస్ (Regular Basis) లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (Specialist Cadre Officers) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Advt. No.CRPD/SCO/2022-23/16) జారీ చేసింది. మొత్తం 19 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నవీ ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది.

Details of Posts

1. Manager (Data Scientist-Specialist)
2. Dy. Manager (Data Scientist-Specialist)
3. System Officer (Specialist)
i. Database Administrator
ii. Application Administrator
iii. System Administrator

Reservation Wise Vacancies

Manager (Data Scientist-Specialist) : 11

  • UR-05, OBC-04, SC-01, ST-01

Dy. Manager (Data Scientist-Specialist) : 05

  • UR-03, OBC-01, ST-01

System Officer (Specialist) : 03

  • UR-01, OBC-01, SC-01

Qualifications

బీ.టెక్/ బీ.ఈ/ ఎం.టెక్ లేదా కంప్యూటర్ సైన్స్/ఐటీ/డేటా సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ మెషిన్ లెర్నింగ్ మరియు ఏఐ(AI) లో ఎం.ఈ (ME) చేసిన వారు అర్హులు.
సంబంధిత అంశాలలో టెక్నికల్ అనుభవంతో పాటు ఫైనాన్షియల్ సెక్టార్, బ్యాంకులు, NBFC, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్ మెంట్ తదితర రంగాలలో అనుభవం ఉండాలి.

Age Limit

మేనేజర్ (డాటా సైంటిస్ట్-స్పెషలిస్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు జూన్ 30, 2022 నాటికి 26 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. డిప్యూటీ మేనేజర్ (డాటా సైంటిస్ట్-స్పెషలిస్ట్), సిస్టమ్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 24 సంవత్సరాలు నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

Pay Scale

Manager (Data Scientist-Specialist)

  • Rs.63,840-1,990/5-73,790-2,220/2-78,230

Dy. Manager (Data Scientist-Specialist), System Officer (Specialist)

  • Rs.48,170-1,740/1-49,910-1,990/10-69,810)

పై వేతనంతో పాటు డీఏ, హెచ్ ఆర్ ఏ, సీసీఏ, పీఎఫ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్, ఎల్ఎఫ్సీ, మెడికల్ ఫెసిలిటీ తదితర బెనిఫిట్స్ కల్పిస్తారు.

How to Apply

  • ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా SBI వెబ్ సైట్ https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers లలోకి లాగిన్ అయ్యి సరైన ఈ-మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • కాల్ లెటర్, ఇంటర్వ్యూ వివరాలు ఈ-మెయిల్ ఐడీకి మాత్రమే పంపిస్తారు.
  • రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ నోట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో ఫీజు చెల్లించవచ్చు.
  • అనంతరం అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ తో అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Documents to be Upload

1. బ్రీఫ్ రెజ్యూమ్
2. ఐడీ ప్రూఫ్
3. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్
4. వైకల్య సర్టిఫికెట్ (దివ్యాంగులు)
5. విద్యార్హతల సర్టిఫికెట్లు (మార్క్స్ షీట్స్, డిగ్రీ సర్టిఫికెట్స్)
6. అనుభవం సర్టిఫికెట్
7. ఫాం-16, ప్రస్తుత సాలరీ సర్టిఫికెట్
8. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ప్రస్తుతం పనిచేస్తున్నవారు)
9. రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
10. సంతకం.
అప్ లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్లు అన్నీ ఏ4 సైజ్లో ఉండాలి. అన్ని కూడా 500 కేబీ సైజ్ లోపే ఉండాలి. రిజిస్ట్రేషన్, అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే బ్యాంకు వెబ్ సైట్ లోని CONTACT US/ Post Your Query ఆప్షన్లపై క్లిక్ చేసి పరిష్కారం పొందవచ్చు.

ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 20, 2022

– Jobs in SBI