MA Economics Course : యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ లో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్ముడ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ (Telangana Social Welfare Residential Armed Forces Preparatory Degree College for Women-TSWRAFPDCW) లో 2022-27 విద్యా సంవత్సరానికి గాను ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంఏ(ఎకనామిక్స్)(IntegratedM.A. (Economics)) కోర్సులో ప్రవేశానికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Social Welfare Residential Educational Institutions Society – TSWREIS) నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రవేశ పరీక్ష (CET-2022), ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి ఈ కోర్సులో అడ్మిషన్లు కల్పిస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
బీబీనగర్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్ముడ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఒక ప్రత్యేకమైన విద్యా సంస్థ. నల్గొండ లోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి అనుబంధం. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎంఏ(ఎకనామిక్స్)తో పాటు ఆర్మీ, నేవీ, వైమానిక దళాలలతో పాటు యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యేందుకు కూడా సైనిక విద్య మరియు శిక్షణను ఇస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు ఐదు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ అభివృద్ధి శాఖ ఉచిత వసతి, దుస్తులు, పుస్తకాలు, వైద్య సేవలు, పరీక్ష ఫీజు అందజేస్తారు.
ఈ కోర్సులో మొదటి సంవత్సరంలో మొత్తం 40 సీట్లు ఉంటాయి. కేవలం బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశ పరీక్ష (ఇంటర్మీడియట్ అకడమిక్ సబ్జెక్టులపై), ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలు, మానసిక విశ్లేషణ పరీక్షలు, వైద్య పరీక్షలు, లెక్చురెట్, ఇంటర్వ్యూ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్షకు 50 మార్కులు, మిగిలిన పరీక్షలకు 50 మార్కులు ఉంటాయి. ప్రవేశ పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఒక్కో జవాబుకు ఒక మార్కు ఉంటుంది. పై అన్ని పరీక్షలు బీబీనగర్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్ముడ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ లోనే నిర్వహిస్తారు.
అడ్మిషన్ సమయంలో ఈ కింది ఒరిజినల్ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంటుంది.
1 కులం సర్టిఫికెట్
2. ఆదాయం సర్టిఫికెట్
3. ట్రాన్స్ ఫర్ (టీసీ) సర్టిఫికెట్
4. బోనఫైడ్ సర్టిఫికెట్
5. ఇంటర్మీడియట్ మెమో
6. ఆధార్ కార్డు
7. ఐదు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
8. ఆరోగ్యశ్రీ కార్డు లేదా రేషన్ కార్డు
ఆసక్తి కలిగిన అర్హులైన విద్యార్థులు TSWREIS వెబ్ సైట్ (www.tswreis.ac.in)ను ఓపెన్ చేసి అందులో Application for Master of Arts – Econamics (IMA – 5 years Course) పై క్లిక్ చేయాలి. అందులో ముందుగా కుడి పక్కన ఉన్న అప్షన్లలో Step-1: Registration with Payment పై క్లిక్ చేయాలి. అందులో పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్, ఇంటర్ లో చదివిన కోర్సు ఎంటర్ చేసి, చెక్ బాక్స్లో టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు నిమిత్తం రూ.100 చెల్లించాలి.
అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి Step-2 : Online Application పై క్లిక్ చేయాలి. అందులో ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫాం వస్తుంది. అందులో పూర్తి వివరాలు ఎంటర్ చేసి, ఫొటో, సంతకం, ఇతర సర్టిఫికెట్లు అప్ లోడ్ చేసి అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాలి. ఏమైనా సందేహాలు ఉంటే విద్యార్థినులు 7995010687, 9493964798 నెంబర్లను సంప్రదించవచ్చు.
ఈ కోర్సు ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది.
ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో చదివిన విద్యార్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే, ఇంగ్లిష్ మీడియంలో చదివిన విద్యార్థినులకు ప్రాధాన్యం ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: అక్టోబర్ 14, 2022
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 25, 2022
హాల్ టికెట్ల డౌన్ లోడ్ : అక్టోబర్ 27, 2022
ప్రవేశ పరీక్ష : అక్టోబర్ 30, 2022 (ఆదివారం)
– MA Economics Course
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…